Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ మోటోరోలా ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Flipkart Big Billion Days Sale 2024 : ఈ మోటోరోలా ఫోన్ మోడల్స్ సెప్టెంబర్ 26 నుంచి అర్ధరాత్రి 12 గంటలకు ప్లస్ కస్టమర్‌లకు, సెప్టెంబర్ 27 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ అందరికి అందుబాటులోకి వస్తాయి.

Flipkart Big Billion Days Sale 2024
Flipkart Big Billion Days Sale 2024 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో మోటరోలా ఫోన్లపై భారీ డీల్స్ అందించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా ఎడ్జ్50ప్రో, మోటోరోలా ఎడ్జ్50 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్50 నియో, మోటో జీ85 5జీ, మోటోలో కొత్త కలర్ వేరియంట్‌లను అందిస్తోంది.
ఈ మోటోరోలా ఫోన్ మోడల్స్ సెప్టెంబర్ 26 నుంచి అర్ధరాత్రి 12 గంటలకు ప్లస్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 27 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ప్రారంభమయ్యే కస్టమర్లందరికీ అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా, మోటోరోలా ఎడ్జ్50ప్రో, ఫ్యూజన్ సేల్ ధరకు ముందే బుక్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 26, 2024 నుంచి ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డే సేల్స్ సమయంలో రీడీమ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డీల్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్50ప్రో (12జీబీ ర్యామ్ విత్ 256జీబీ ఆర్ఓఎమ్ వేరియంట్) రూ. 35,999 వద్ద రిటైల్ అవుతుంది. కేవలం రూ. 27,999 ధరతో (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) కొనుగోలు చేయవచ్చు.
అంతేకాకుండా, మోటోరోలా ఎడ్జ్50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 19,999కు అందిస్తోంది. సెగ్మెంట్ బెస్ట్ సోనీ ఎల్‌వైటీఐఏ ఎల్‌వైటీ-700సి కెమెరా, ఆల్-పిక్సెల్ ఇన్‌స్టంట్ ఫోకస్ టెక్నాలజీతో కూడిన 50ఎంపీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కె వీడియో రికార్డింగ్‌తో వస్తుంది. మోటోరోలా ఎడ్జ్50 నియో డిస్కౌంట్‌తో విక్రయించే మరో మోటోరోలా స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ మొత్తం 4 పాంటోన్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల తర్వాత పండుగ ధర రూ. 22,999కు పొందవచ్చు.
మోటోరోలా మోటో జీ85 5జీలో కొత్త వివో మాగ్నెంటా కలర్ వేరియంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ 50ఎంపీ ఓఐఎస్ సోనీ ఎల్‌వైటీఐఏ 600 కెమెరాను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో 128జీబీ, ఆర్ఓఎమ్ 12జీబీ ర్యామ్‌తో 256/జీబీ ఆర్ఓఎమ్ రెండు వేరియంట్లలో వరుసగా రూ.15,999, రూ. 17,999కు అందుబాటులో ఉంది. మోటో జీ64 5జీ కొత్త బెర్రీ రెడ్ కలర్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 15వేల సెగ్మెంట్ కింద రూ. 13,999కే పొందవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ను అందిస్తుంది. 2.5GHz వరకు ఫ్రీక్వెన్సీలతో కూడిన పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది.