Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్.. ఐఫోన్ సహా 3 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Flipkart Sale Offers : ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ పొందవచ్చు.

Flipkart Big Shopping Utsav sale _ Apple iPhone 15
Flipkart Big Shopping Utsav Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ పొందవచ్చు.
గత సేల్ కోల్పోయిన వినియోగదారులు ఈ సేల్ ఈవెంట్‌లో సులభంగా సొంతం చేసుకోవచ్చు. అయితే, అన్ని డీల్‌ల సేల్ ధరలు గత డిస్కౌంట్లతో పోలిస్తే సమానంగా ఉండవని గుర్తుంచుకోండి. ఆపిల్ ఐఫోన్ 15, మోటో జీ85, నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1 వంటి అన్ని ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
ఆపిల్ అత్యంత పాపులర్ ఐఫోన్‌లలో ఐఫోన్ 15 ఒకటి. ఈ ఐఫోన్ ధర మళ్లీ ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా ఐఫోన్15 మోడల్ ధర రూ. 57,999కి విక్రయిస్తోంది. ఆపిల్ స్టోర్ అదే ఫోన్‌ను రూ.69,900కి అందిస్తోంది. మీకు రూ.11,901 తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ భారీ తగ్గింపును పొందింది.
ఇప్పుడు కేవలం రూ. 65,999 తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ధర ప్రస్తుత అధికారిక రిటైల్ ధర 79,900 నుంచి తగ్గింది. బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ రూ. 13,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అదేవిధంగా, ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,15,999 ఉంటే.. ఈ ప్రో మోడల్‌పై విజయ్ సేల్స్ ఆకర్షణీయమైన డీల్‌ను అందిస్తోంది. తద్వారా రూ. 1,04,490 వద్ద ఐఫోన్ 15ప్రో కొనుగోలు చేయొచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికొస్తే.. :
మోటో జీ85 ఫోన్ ప్రముఖ మోటోరోలా ఫోన్ తక్కువ ధరలో కూడా లభిస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్ రూ. 16,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారా తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఆసక్తిగల యూజర్లు ఈ ఫోన్ రూ. 14,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. భారత్‌లో రూ. 15,999 వద్ద లాంచ్ కాగా.. యూజర్లు రూ. వెయ్యి ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. 256జీబీ స్టోరేజ్ మోడల్‌తో పోకో ఎక్స్6ప్రో ధర రూ. 20,999కి అమ్మకానికి ఉంది.
సాలిడ్ మిడ్-రేంజ్ ఫోన్ ఇది.. భారత మార్కెట్లో రూ. 24,999 వద్ద లాంచ్ కాగా ఫ్లిప్‌కార్ట్ రూ. 4వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. మోటో ఎడ్జ్ 50నియో ధర రూ.23,999 నుంచి రూ.22,999కి తగ్గింది. ఈ డీల్‌లలో కొన్ని బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లతో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి, లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అయితే, ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ సేల్ వ్యవధిలో కూడా ఫోన్ ధరల డీల్స్ మార్చే అవకాశం ఉంది.