Samsung Galaxy Z Flip 7 5G : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే చాలా చౌక..!
Samsung Galaxy Z Flip 7 5G : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఆఫర్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Samsung Galaxy Z Flip 7 5G
- శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 5జీ 6.9-అంగుళాల అమోల్డ్ 2X డిస్ప్లే
- ఈ మడతబెట్టే ఫోన్ 5జీ లో 50MP వైడ్-యాంగిల్ కెమెరా ఉంది
- శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 5జీ ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో వస్తుంది
Samsung Galaxy Z Flip 7 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ ఫోల్డబుల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. గత ఏడాది జూలైలో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 5జీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
మీరు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 5జీని అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లతో రాయితీ ధరకు అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 5జీపై డీల్స్, ఆఫర్ల వివరాలను అందిస్తోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 5జీ ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ మోడల్, గత ఏడాదిలో జూలైలో రూ. 109,999గా ఉండగా, ఇప్పుడు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 95,999 ధరకు అందుబాటులోకి వచ్చింది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 4వేలు తగ్గింపు వంటి బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తద్వారా ధర రూ. 91,999కి చేరింది. ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారు రూ. 18వేలు తక్కువకే లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 5జీలో 2520×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz-120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X ప్రైమరీ డిస్ప్లే ఉంది. రెండో 4.1-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ డిస్ప్లే 1048×948 పిక్సెల్స్ రిజల్యూషన్, 60/120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP48 రేటింగ్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 7 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 4,300mAh బ్యాటరీ కూడా ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, LTE, Wi-Fi 7, బ్లూటూత్ v5.4 ఉన్నాయి.
