Flipkart : యూజర్లకు గొప్ప అవకాశం.. పాత ఫోన్ ఇవ్వండి, కొత్తది తీసుకోండి
యూజర్లు చేయాల్సింది యంత్ర వెబ్ సైట్ లోకి వెళ్లి ఫోన్ లకు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానాల అనంతరం 48 గంటల్లో ప్లిఫ్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి...

Flipkart
Old Phone Sale Back Programme : ఫోన్ యూజర్లకు గొప్ప అవకాశం కల్పిస్తోంది ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్ కార్ట్. పాత ఫోన్ ఇవ్వండి, కొత్త ఫోన్ తీసుకోండి అంటూ సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్ ను తీసకోవడం లేదా ఇతర కొత్త ప్రాడెక్ట్ లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే సందర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేసింది. రీ కామర్స్ సంస్థ సాయంతో పాత ఫోన్ లను కలెక్ట్ చేస్తుంది. యూజర్లు చేయాల్సింది యంత్ర వెబ్ సైట్ లోకి వెళ్లి ఫోన్ లకు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.
Read More : Input Subsidy : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రేపే ఖాతాల్లోకి డబ్బులు
ఆ సమాధానాల అనంతరం 48 గంటల్లో ప్లిఫ్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్ ను కలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కు ప్లిఫ్ కార్ట్ ఈ వోచర్ ను పంపిస్తుంది. దీని ద్వారా… ప్లిఫ్ కార్ట్ లో కొత్త ఫోన్ లేదా ఇతర ప్రాడక్ట్స్ కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న 1700 పిన్ కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లను ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే..ఫోన్ ను అమ్ముకొనే ఛాన్స్ ను ప్లిఫ్ కార్ట్ లో అమ్మే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది.