iPhone 16 Plus : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్.. ఈ ఐఫోన్ మోడల్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు కూడా.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Flipkart Valentines Day Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ధర అమాంతం తగ్గేసింది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Flipkart Valentines Day sale
Flipkart Valentines Day Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఐఫోన్ 16 ప్లస్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 16 ఫోన్ అందుబాటులో ఉంది.
వాలెంటైన్స్ డే సేల్ సమయంలో కస్టమర్లు కొన్ని ఆకర్షణీయమైన డీల్‌లను పొందవచ్చు. భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ధరతో లాంచ్ కాగా, ఇప్పుడు ఈ ఐఫోన్ రూ. 74వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో పాటు 48MP ఫ్యూజన్ కెమెరాతో లేటెస్ట్ ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. అసలు ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 ప్లస్ ధర, ఆఫర్లు :
ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.78,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.11వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు తమ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. దాంతో మొత్తం ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.74వేల కన్నా తక్కువకే వస్తుంది.
మీరు ఐఫోన్ 16 ప్లస్‌తో మీ పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు అదనపు ఎక్స్ఛేంజ్‌లో రూ. 7వేల వరకు పొందవచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా పాత డివైజ్ సాధ్యమైనంత వరకు మంచి ధర పలుకుతుంది.
ఐఫోన్ 16 ప్లస్ కొనుగోలుదారులు తమ ICICI, SBI, Axis, HDFC బ్యాంక్ కార్డులను ఉపయోగించి నెలకు రూ.12,333 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం 128GB స్టోరేజ్ మోడల్‌పై మాత్రమేనని కొనుగోలుదారులు గమనించాలి.
ఐఫోన్ 16 ప్లస్ స్పెషిఫికేషన్లు :
ఈ ఐఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా (XDR) ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందిస్తుంది. A18 చిప్‌సెట్‌తో వస్తుంది. iOS 18.3 అప్‌డేట్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. IP68-సర్టిఫైడ్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఆపిల్ ప్రకారం.. ఈ ఐఫోన్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
కెమెరా విషయానికొస్తే, ఈ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 48MP ప్రైమరీ షూటర్‌తో పాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కెమెరా కంట్రోల్స్ కూడా డివైజ్ సైడ్ ఉండటం వల్ల ఫోటోగ్రఫీ విజువల్ ఇంటెలిజెన్స్‌తో అత్యంత సులభంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఐఫోన్ 16 ప్లస్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోండి.