Free Aadhaar Update : ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్.. సెప్టెంబర్ 14 వరకు గడువు పొడిగింపు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Free Aadhaar Update : యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్‌లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

Free Aadhaar Update : ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్.. సెప్టెంబర్ 14 వరకు గడువు పొడిగింపు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Free Aadhaar Update _ UIDAI extends deadline ( Image Source : Google )

Free Aadhaar Update : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మరోసారి గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. యూఐడీఏఐ ప్రకారం.. యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్‌లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అప్‌డేట్‌లకు మాత్రమ రూ. 50 రుసుము వర్తిస్తుంది.

Read Also : Best Mobile Phones 2024 : ఈ నెలలో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

సెప్టెంబర్ 14 వరకు యూఐడీఏఐ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు, అడ్రస్, ఫోటో ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. ఫ్రీ ఆధార్ అప్‌డేట్ గడువు తేదీని పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు గడువు తేదీలకు పొడిగించింది. డిసెంబర్ 15, 2023 తర్వాత మార్చి 14కి పొడిగించగా.. ఆ తర్వాత జూన్ 14కి, ఇప్పుడు సెప్టెంబర్ 14కి పొడిగించింది యూఐడీఏఐ.

ఆధార్ కార్డ్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలంటే? :

  • మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ని ఉపయోగించి (https://myaadhaar.uidai.gov.in/)కి లాగిన్ చేయండి
  • క్యాప్చా ఎంటర్ చేసి, ‘Login using OTP’పై క్లిక్ చేయండి.
  • మీ లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో అందుకున్న ఓటీపీ కోడ్‌ని ఎంటర్ చేయండి.
  • మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.
  • ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంచుకోండి. నివాసి ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
  • ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్స్ ఎంచుకుని అవసరమైన ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి.
  • ‘Submit’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • అప్‌డేట్ అభ్యర్థన 14-అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు.

Read Also : iPhone 15 Pro Action Button : ఐఓఎస్ 18 సపోర్టు.. ఆపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!