BSNL International Plan : విదేశాలకు వెళ్తున్నారా? BSNL ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్.. 30 రోజులు 18 దేశాల్లో ఎంజాయ్ చేయొచ్చు..!
BSNL International Plan : విదేశాలకు వెళ్లే వారికోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ అందిస్తోంది. ధర, బెనిఫిట్స్ వివరాలివే..

BSNL International Plan
BSNL International Plan : విదేశాలకు వెళ్తున్నారా? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఇంటర్నేషనల్ (BSNL International Plan) రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో కనెక్టివిటీ కోసం కొత్త లాంగ్ టైమ్ ప్రీపెయిడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది.
గోల్డ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ ధర రూ.5,399కు లభ్యమవుతుంది. రోజుకు కేవలం రూ.180 ఖర్చుతో అంతర్జాతీయ కాలింగ్‌తో పాటు డేటా ప్యాక్, SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
బీఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ బెనిఫిట్స్ :
బీఎస్ఎన్ఎల్ రూ.5,399 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో 3GB హై-స్పీడ్ డేటా, 30 నిమిషాల అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్స్, 15 SMS మెసేజ్‌లను అందిస్తుంది. ముఖ్యంగా టూరిస్టులు, బిజినెస్ ప్యాసెంజర్స్, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ IR ప్లాన్ :
ఈ BSNL రూ. 5,399 రీఛార్జ్ ప్లాన్.. భూటాన్, జర్మనీ, మలేషియా, డెన్మార్క్, ఇజ్రాయెల్, గ్రీస్, ఫ్రాన్స్, జపాన్, కువైట్, మయన్మార్, నేపాల్, వియత్నాం, బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రియా, శ్రీలంకతో సహా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో అందుబాటులో ఉంది.
వినియోగదారులు BSNL వెబ్‌సైట్, యాప్ లేదా లోకల్ రిటైలర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, రీఛార్జ్ చేసే వినియోగదారులు తమ BSNL సిమ్‌లో ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ అయి ఉండాలి.
ఇంటర్నేషనల్ రోమింగ్ ఎలా యాక్టివేట్ చేయాలి? :
బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ రోమింగ్ యాక్టివేషన్ కోసం వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ 1503కు కాల్ చేయాలి. MyBSNL యాప్ ద్వారా తమ సంబంధిత నంబర్‌కు IR యాక్టివేషన్ అడగాలి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత నెట్‌వర్క్ ఇప్పటికీ ఆటోమాటిక్ కనెక్ట్ కాకపోతే వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ట్యాబ్ కింద ఫోన్ సెట్టింగ్స్‌లో నెట్‌వర్క్ ఆప్షన్ల కింద “International” ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.