Google Chrome: క్రోమ్ క్లోజ్ చేయాలంటే ఇకపై ఇది తప్పనిసరి
ఒక్క ట్యాబ్ తోనే కాకుండా పలు ట్యాబ్ లలో ఓపెన్ చేసి సర్ఫింగ్ చేసుకునే వీలుండటంతో మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకేసారి నిర్వహించుకోవచ్చు. అలా చేస్తున్న సమయంలో క్రోమ్ క్లోజ్...

Google Chrome For Android Devices To Get This New ‘privacy’ Feature
Google Chrome: మొబైల్ ఫోన్స్ తో పాటు డెస్క్‌టాప్ లో క్రోమ్ తప్పనిసరి అయిపోయింది. దాదాపు ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ క్రోమ్ కే అలవాటుపడ్డారు. ఒక్క ట్యాబ్ తోనే కాకుండా పలు ట్యాబ్ లలో ఓపెన్ చేసి సర్ఫింగ్ చేసుకునే వీలుండటంతో మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకేసారి నిర్వహించుకోవచ్చు. అలా చేస్తున్న సమయంలో క్రోమ్ క్లోజ్ చేసేందుకు ట్రై చేస్తే అన్నీ ఒకేసారి క్లోజ్ అయిపోతాయి.
ఇప్పుడు రాబోయే ఫీచర్ తో క్రోమ్ క్లోజ్ చేసే ముందే మనల్ని పర్మిషన్ అడుగుతుందట. అన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేయాలా అని అడిగే ఆపరేషన్ పూర్తి చేస్తుందట. chrome://flags పేజిలో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చట. న్యూ కన్ఫర్మేషన్ పాపప్ లో క్లోజ్ ఆల్ ట్యాబ్స్ మెనూను సెలక్ట్ చేసుకోవాలి.
డైలాగ్ బాక్స్ రాగానే క్యాన్సిల్ చేయడమా.. కన్ఫామ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫమ్ చేయగానే అన్నీ ట్యాబ్ లు ఒకేసారి క్లోజ్ అయిపోతాయి. కెనరీలో టెస్టింగ్ జరుగుతున్న ఈ ఫీచర్ సక్సెస్ అయ్యాక రెగ్యూలర్ సెట్టింగ్స్ కు రిలీజ్ చేయనుంది గూగుల్.