Google Retail Store : ప్రపంచంలోనే తొలి గూగుల్ రిటైల్‌ స్టోర్.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ టెక్ దిగ్గజం గూగుల్.. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ దారిలోనే వెళ్తోంది. గూగుల్ తమ మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను లాంచ్ చేసింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించింది.

Google Retail Store : ప్రపంచంలోనే తొలి గూగుల్ రిటైల్‌ స్టోర్.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

Google Opens World's First Google Retail Store

Updated On : June 18, 2021 / 1:30 PM IST

World’s First Google Retail Store : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ టెక్ దిగ్గజం గూగుల్.. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ దారిలోనే వెళ్తోంది. గూగుల్ తమ మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను లాంచ్ చేసింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించింది. ఈ స్టోర్‌లో కస్టమర్ల కోసం పలు రకాల హార్డ్‌వేర్ ప్రోడ‌క్ట్స్‌ అందిస్తోంది. ఫిక్సల్ ఫోన్లు, నెస్ట్ ప్రొడక్టులతో పాటు వేరబుల్ ఫిట్ బెట్, ఫిక్సల్ బుక్స్ వంటి సర్వీసులను అందించనుంది.

కస్టమర్లు ఈ స్టోర్ విజిట్ చేసిన సమయంలో గూగుల్ ఫిక్సల్ ఫోన్లు, నెస్ట్ ప్రోడక్టుల ఫీచర్లను తెలుసుకోవచ్చు. గూగుల్ సాఫ్ట్ వేర్, సర్వీసులు, ప్రొడక్టుల్లో గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, స్టేడియా వంటి అన్నిసర్వీసులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు. కస్టమర్లు స్టోర్ లోకి అడుగుపెట్టగానే ముందుగా వారికి ఫిజికల్, డిజిటల్ ప్రొడక్టుల డిస్ ప్లే కనిపిస్తుందని గూగుల్ పేర్కొంది.

ఈ స్టోర్ ప్రధాన మార్గంలో 17 అడుగుల ఎత్తైన వృత్యాకార గ్లాస్ స్ట్రక్చర్ ఉంటుంది.. దీన్ని గూగుల్ ఇమాజినేషన్ స్పేస్ (Google Imagination Space) అని పిలుస్తారు. ఇందులో కస్టమ్ ఇంటరాక్టివ్ స్ర్కీన్లు ఉంటాయి. ప్ర‌పంచంలో LEED ప్లాటినం రేటింగ్‌లు ఉన్న 215 స్టోర్ల‌లో గూగుల్ రిటైల్ స్టోర్ ఒకటిగా ఉందని, తమ స్టోర్‌ను సంద‌ర్శించిన అంద‌రికీ కృతజ్ఞ‌త‌ల‌ు తెలుపుతూ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.


న్యూయార్క్ వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా ఈ గూగుల్ స్టోర్‌ను తాను విజిట్ చేస్తానని చెప్పారు. ఐఫోన్ల రిపేర్ కోసం ఆపిల్ స్టోర్ల‌కు వెళ్లిన‌ట్లే.. పిక్సెల్ ఫోన్ల రిపేర్ కోసం ఈ గూగుల్ స్టోర్లకు వెళ్ల‌వ‌చ్చు. ఇక్కడి స్టోర్ లో కస్టమర్ల మాట్లాడే భాషకు తగినట్టుగా ఒకేసారి 24 భాషల్లో రియల్ టైం ట్రాన్సలేషన్ అవుతుంది. తద్వారా సులభంగా కస్టమర్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.