Google Pixel 6a Price : భారత్‌కు గూగుల్ Pixel 6a ఫోన్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?
భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది.

Google Pixel 6a Price In India Likely To Be Under Rs 40,000, May Launch Later This Month (1)
Google Pixel 6a Price : భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. జూలై చివరి నాటికి భారత్‌లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉండవచ్చు. Pixel 5a తర్వాత వచ్చిన Pixel 6a ఫోన్.. ఈ కామర్స్ దిగ్గజం Flipkart ద్వారా ఈ నెలాఖరులో లాంచ్ కానుంది. ఈ ఏడాది మేలో Google I/O ఈవెంట్‌లో Google Pixel 6aని ప్రకటించింది. Pixel 6a పిక్సెల్ 6 సిరీస్‌కు డిజైన్‌ను అందిస్తోంది. Google సొంత టెన్సర్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.
Pixel 6a ధర తగ్గింపు :
పిక్సెల్ 6A ధరను గూగుల్ ట్విట్టర్‌లో వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం.. భారత మార్కెట్లో Pixel 6a ధర సుమారు రూ. 37వేలుగా ఉంది. అయితే, ఈ డివైజ్ ధర రూ.40వేలుగా ఉంటుందని నివేదిక పేర్కొంది. పిక్సెల్ 6a లాంచ్ తేదీ ఈ నెలాఖరులో గూగుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అందించనున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Google Pixel 6a Price In India Likely To Be Under Rs 40,000, May Launch Later This Month
ప్రపంచ ధరల విషయానికి వస్తే.. కెనడాలో Google Pixel 6a ధర (CAD 599) యూకేలో ఈ డివైజ్.. సింగిల్ 6GB వేరియంట్ ధర 459గా ఉంది. ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లలో ఈ డివైజ్ EUR 459 ధర ట్యాగ్‌ను కలిగి ఉంది. పిక్సెల్ 6a చార్‌కోల్ వేరియంట్ సింగపూర్, ఐర్లాండ్‌లలో అందుబాటులో ఉంటుందని నివేదిక వెల్లడించింది.
Pixel 6a స్పెసిఫికేషన్స్ :
Pixel 6a ఫోన్.. గత ఏడాదిలో Pixel 6 ట్రిమ్-డౌన్ వెర్షన్. పిక్సెల్ 6కి చాలా పోలి ఉంటుంది. ఈ ఫోన్ పిక్సెల్ 6 నుంచి కెమెరా బార్‌ను తెచ్చుకుంది. చాక్, చార్‌కోల్, సేజ్‌తో సహా మూడు కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. Google ప్రీమియం ఫోన్లు-Pixel 6, Pixel 6 Proతో వచ్చింది. ఈ తక్కువ ధర $449గా ఉంది. Google Tensor చిప్‌సెట్‌తో కెమెరాలతో వస్తుంది. పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ప్రధాన లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్.. Pixel 6aలో సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. Pixel 6 మాదిరిగా అద్భుతమైన కెమెరాతో వచ్చింది.