Google Pixel 9 : ఆఫర్ భలే ఉంది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 9 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏకంగా రూ.9వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 9 : ఆఫర్ భలే ఉంది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Google Pixel 9

Updated On : February 12, 2025 / 11:54 AM IST

Google Pixel 9 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన డీల్ మీకోసం.. మీరు గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ అయితే ఇది మీకోసమే.. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌కు పేరుగాంచిన గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Read Also : iPhone 16 Plus : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్.. ఈ ఐఫోన్ మోడల్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు కూడా.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

లాంచ్ అయిన ప్రారంభంలో ఈ పిక్సెల్ 9 ఫోన్ రూ. 79,999 ధరకు లభించగా, ప్రస్తుతం ఈ ఫోన్ ఏకంగా రూ. 9వేల తగ్గింపుతో లభ్యమవుతుంది. అతి తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ 9ని పొందడానికి ఇది మంచి అవకాశం. మీరు ఫోటోగ్రఫీ ప్రియులైనా లేదా మృదువైన ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నా పిక్సెల్ 9 మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

పిక్సెల్ 9 ఫ్లిప్‌కార్ట్ డీల్ ఇదిగో :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ రూ.70,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5వేల తగ్గింపుతో అందిస్తోంది. తద్వారీ ఈ ఫోన్ ధరను రూ.74,999కు తగ్గించింది. అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా చేయాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు. తద్వారా మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో గూగుల్ పిక్సెల్ 9పై రూ.60,600 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ రేటు స్మార్ట్‌ఫోన్ మోడల్, ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. మీకు గూగుల్ పిక్సెల్ 7a ఉంటే.. మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉంటే.. మీరు రూ.15,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ (1080 x 2424) పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల (OLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2700 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. హెచ్‌‌డీఆర్ సపోర్టు అందిస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు RAM, 256GB స్టోరేజీతో వస్తుంది.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయంటే?

ఇంకా, ఈ పిక్సెల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇలాంటి పిక్సెల్ ఫోన్ కోసం చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..