Google Pixel Phones : పిక్సెల్ ప్రియుల కోసం ఏప్రిల్ 2025 అప్‌డేట్.. ఈ ఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ ఉంటే అప్‌డేట్ చేసుకోండి..!

Google Pixel Phones : పిక్సెల్ అభిమానుల కోసం గూగుల్ ఏప్రిల్ 2025 కొత్త అప్‌డేట్ ప్రవేశపెట్టింది. పిక్సెల్ ఫోన్లలో బగ్స్ ఇష్యూను ఫిక్స్ చేసినట్టుగా టెక్ దిగ్గజం చెబుతోంది. ఈ జాబితాలో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.

Google Pixel Phones : పిక్సెల్ ప్రియుల కోసం ఏప్రిల్ 2025 అప్‌డేట్.. ఈ ఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ ఉంటే అప్‌డేట్ చేసుకోండి..!

Google Pixel Phones

Updated On : April 12, 2025 / 5:20 PM IST

Google Pixel Phones : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పిక్సెల్ ఫోన్ల కోసం ఏప్రిల్ 2025 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. కంపెనీ లేటెస్ట్ పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ టాబ్లెట్, ఆండ్రాయిడ్ 15 రన్ అయ్యే ఇతర పాత పిక్సెల్ ఫోన్లలో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌గా వస్తుంది.

బయోమెట్రిక్ అథెంటికేషన్ కెమెరా, యూజర్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన బగ్స్ ఫిక్స్ చేసేందుకు ఈ కొత్త అప్‌డేట్ తీసుకువస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. ఇంకా, ఏప్రిల్ 2025 అప్‌డేట్‌లో సాఫ్ట్‌వేర్‌లోని 3 సెక్యూరిటీ లోపాలను ఫిక్స్ చేసే సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఉంది.

Read Also : UPI QR Payments : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. ఇకపై షేరింగ్ QR కోడ్‌తో ఇంటర్నేషనల్ యూపీఐ పేమెంట్స్ చేయలేరు..!

గూగుల్ పిక్సెల్ కొత్త అప్‌డేట్ :
కంపెనీ సపోర్ట్ పేజీలో గూగుల్ కమ్యూనిటీ మేనేజర్ గ్లోబల్ మోడల్స్ కోసం ఏప్రిల్ 2025లో పిక్సెల్ అప్‌డేట్ ఫీచర్లను BP1A.250405.007, BP1A.250405.007.B1, BD4A.250405.003 అనే బిల్డ్ నంబర్‌లతో అప్‌డేట్ చేసింది. అదే సమయంలో, తైవాన్+EMEA, వెరిజోన్, డ్యూష్ టెలికామ్‌లతో కూడిన పిక్సెల్ ఫోన్లలో కొద్దిగా భిన్నమైన ఐడెంటిఫైయర్‌లను కలిగి ఉన్నాయి. ఈ కింది పిక్సెల్ ఫోన్లు ఈ కొత్త అప్‌డేట్ అందుకోనున్నాయి.

  • Google Pixel 9 Series
  • Google Pixel 8 Series
  • Google Pixel Tablet
  • Google Pixel Fold
  • Google Pixel 7 Series
  • Google Pixel 6 Series

చేంజ్‌లాగ్ ప్రకారం.. ఈ ప్యాచ్ కొన్ని పరిస్థితులలో ఫింగర్‌ఫ్రింట్ డిటెక్షన్, రెస్పాండ్ ఇష్యూను పరిష్కరిస్తుంది. ఈ సమస్య పిక్సెల్ 6 సిరీస్ నుంచి ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 మోడళ్ల వరకు స్మార్ట్‌ఫోన్‌లలో నివేదించారు. కొన్ని పరిస్థితులలో జూమ్ ఇన్ లేదా అవుట్ చేసినప్పుడు కెమెరా స్టేబులిటీ మెరుగుపరిచే పరిష్కారాన్ని అందిస్తుంది.

పిక్సెల్ ఫోన్ల అప్‌డేట్‌లో డిస్‌ప్లే, గ్రాఫిక్స్ కోసం మరొకటి.. పైన పేర్కొన్న మోడళ్లలో కొన్నింటిలో OTT స్ట్రీమింగ్ యాప్‌లలో కంటెంట్‌ను వాడేటప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్ ఫ్లికర్ సమస్య వస్తోంది. పిక్సెల్ ఫోన్లలో యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వినియోగదారులు రెండు సమస్యలను కూడా నివేదించారని గూగుల్ చెబుతోంది.

ఒకటి లాక్ స్క్రీన్ వెదర్ వాచ్‌లో ఓవర్ ల్యాపింగ్ కారణమైంది. మరొకటి కొత్త యూజర్ క్రియేట్ చేసే సమయంలో వినియోగదారుల మధ్య మారేటప్పుడు పిక్సెల్ లాంచర్‌ను ప్రభావితం చేసింది. ఏప్రిల్ 2025 అప్‌డేట్ ఈ రెండింటినీ ఫిక్స్ చేస్తుంది.

Read Also : LunaRecycle Challenge : నాసా బంపర్ ఆఫర్.. చంద్రుడిపై మానవ వ్యర్థాలను తొలగించే ఐడియా చెప్పండి.. రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ.. మీ సొంతం!

ఈ అప్‌డేట్ బగ్ ఫిక్సింగ్‌తో పాటు 3 సాధారణ సెక్యూరిటీ లోపాలు, ఎక్స్‌పోజర్ (CVE) కోసం భద్రతా ప్యాచ్‌ను అందిస్తుందని చేంజ్‌లాగ్ పేర్కొంది. CVE-2025-26415 ఐడెంటిఫైయర్‌లో లిస్ట్ అయింది. గూగుల్ అసిస్టెంట్ సబ్‌కాంపోనెంట్‌లో గుర్తించారు. CVE-2024-56190, CVE-2024-56189 వరుసగా బ్రాడ్‌కామ్ WLAN డ్రైవర్, మోడెమ్ సబ్‌కాంపోనెంట్‌లలో ఉండగా, ఈ బగ్స్ తీవ్రత అధికంగా ఉందని నివేదిక తెలిపింది.