Ratan Tata Death : రతన్ టాటాకు సుందర్ పిచాయ్ నివాళులు.. ఆయన విజన్ ఎంతో స్ఫూర్తిదాయకం..!

Ratan Tata Death : రతన్ టాటాకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌లో దూరదృష్టి గల వ్యాపార నేతతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. 

Ratan Tata Death : రతన్ టాటాకు సుందర్ పిచాయ్ నివాళులు.. ఆయన విజన్ ఎంతో స్ఫూర్తిదాయకం..!

'His Vision Was Inspiring To Hear'_ Google CEO Sundar Pichai Recalls Last Meeting With Ratan Tata

Updated On : October 10, 2024 / 2:05 PM IST

Ratan Tata Death : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా మృతిపట్ల పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రతన్ టాటాకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌లో దూరదృష్టి గల వ్యాపార నేతతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.

Read Also : Ratan Tata death : రతన్ టాటా మృతిపట్ల ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ నేతల సంతాపం!

“గూగుల్‌లో రతన్ టాటాతో నా చివరి సమావేశం.. మేము అనేక అంశాలపై చర్చించాం. ఆయన విజన్ గురించి వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన అసాధారణమైన వ్యాపారం, దాతృత్వ వారసత్వాన్ని విడిచిపెట్టారు. భారత్‌లో ఆధునిక వ్యాపార నాయకత్వాన్ని మార్గదర్శకత్వం చేయడంలో కీలక పాత్ర పోషించారు”అని పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. “భారత్‌ను అభివృద్ధిపథంలో నడపడంలో టాటా చాలా శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నాను అంటూ పిచాయ్ ట్విట్టర్ వేదికగా పోస్టు నివాళులను అర్పించారు.

టాటా గ్రూప్‌ను 20 ఏళ్లకు పైగా ఛైర్మన్‌గా నడిపిన రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం అర్థరాత్రి రతన్ టాటా మరణాన్ని ధృవీకరించారు. ఆయన వయసు సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు అవాస్తవమని టాటా గ్రూపు ఒక ప్రకటన విడుదల చేసింది.

రతన్ టాటాకు నివాళులు :
ఆయన మరణ వార్త తెలియగానే ఇంటర్నెట్‌లో అన్ని రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. పారిశ్రామికవేత్తకు నివాళులర్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. వ్యాపార ప్రపంచం నుంచి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా వ్యాపార దిగ్గజం మృతిపట్ల సంతాపం తెలిపారు.

Read Also : Ratan Tata Success Story : రతన్ టాటా సక్సెస్ స్టోరీ.. యువతరానికే స్ఫూర్తిదాయకం.. వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారంటే?