Honor 300 Pro Series : హానర్ 300 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
Honor 300 Pro Series Launch : హానర్ 200ప్రోకు అప్‌గ్రేడ్‌గా భావిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ హానర్ 300, హానర్ 300 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లతో పాటుగా లాంచ్ కానుంది.

Honor 300 Pro Spotted on Geekbench
Honor 300 Pro Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త హానర్ 300ప్రో డిసెంబర్ 2న చైనాలో లాంచ్ కానుంది. హానర్ 200ప్రోకు అప్‌గ్రేడ్‌గా భావిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ హానర్ 300, హానర్ 300 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లతో పాటుగా లాంచ్ కానుంది.
కంపెనీ ఇటీవలే ప్రో వేరియంట్ డిజైన్, కలర్‌వేస్‌తో పాటు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను వెల్లడించింది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 9.0తో రన్ అయ్యేలా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీని కలిగి ఉండనుంది. లాంచ్‌కు ముందు, హానర్ 300 ప్రో గీక్‌బెంచ్‌లో చిప్‌సెట్ అండర్‌క్లాక్డ్ వెర్షన్‌తో కనిపించింది.
హానర్ 300 ప్రో లిస్టింగ్ :
హానర్ ఎఎంపీ-ఎఎన్00 మోడల్ నంబర్‌తో హానర్ 300 ప్రో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ జాబితాలో హానర్ 300 ప్రోని సింగిల్-కోర్, మల్టీ-కోర్ స్కోర్‌లతో వరుసగా 2,141, 6,813తో చూపిస్తుంది. ఒక కోర్ క్లాకింగ్ 3.05 GHzతో ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో కనిపిస్తుంది. 5 పర్ఫార్మెన్స్ కోర్లు 2.96GHz స్పీడ్‌తో కనిపిస్తాయి. అయితే, రెండు కోర్లు 2.04GHz కలిగి ఉంటాయి.
మెయిన్ కోర్ సాధారణంగా 3.30GHz వేగాన్ని కలిగి ఉండవచ్చు. ప్రామాణిక స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ కన్నా వేగం తక్కువగా ఉంటుంది. హానర్ 300 ప్రో ప్రాసెసర్ కూలింగ్ సిస్టమ్ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా. హానర్ 300ప్రో మిడ్ రేంజ్ మోడల్ హానర్ అత్యుత్తమ, ఫ్లాగ్‌షిప్-లెవల్ కూలింగ్ టెక్నాలజీని అందించకపోవచ్చు. క్వాల్‌కామ్ మునుపటి జనరేషన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ గరిష్ట పర్ఫార్మెన్స్ అందించకపోవచ్చు.
హానర్ 300 సిరీస్ లాంచ్ :
చైనాలో హానర్ 300 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌లతో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 9తో ఫోన్‌లు రన్ అవుతాయి. సెక్యూరిటీ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రధాన కెమెరాలు, 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. హానర్ 300ప్రో ర్యామ్, 12జీబీ + 256జీబీ, 12జీబీ + 512జీబీ, 16జీబీ + 512జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రానుంది. ఈ హానర్ సిరీస్ ఇంక్ రాక్ బ్లాక్, టీ కాజీ, స్టార్‌లైట్ శాండ్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు.
Read Also : iPhone 16 Discount : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. కొత్త ధర ఎంతంటే?