Honor 90 5G Launch : హానర్ 90 5G ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Honor 90 5G Launch : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ నెల 14న భారత మార్కెట్లోకి హానర్ 90 5G ఫోన్ వచ్చేస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

Honor 90 5G to Launch in India on September 14 Expected Price, Specifications
Honor 90 5G Launch : హానర్ అభిమానులకు అదిరే వార్త.. చాలా ఏళ్ల తర్వాత HTech కంపెనీ హానర్ (Honor) తిరిగి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. వచ్చేవారమే భారత మార్కెట్లోకి Honor 90 5G ఫోన్ రానుంది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం (సెప్టెంబర్ 7) తన అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా దేశంలో కొత్త హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని టీజ్ చేసింది.
Honor 90 5G ఫోన్ 3840Hz PWM డిమ్మింగ్‌ని కలిగి ఉండనుంది. హానర్ 90 ప్రోతో పాటు మేలో ఈ హ్యాండ్‌సెట్ చైనీస్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. హానర్ 90 5G భారత మార్కెట్లో సెప్టెంబర్ 14న లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. HTech బ్రాండ్ లాంచ్ మీడియా ఇన్విటేషన్లను కూడా పంపుతోంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ (Amazon) ద్వారా విక్రయించనున్నట్టు ధృవీకరించింది.
Read Also : WhatsApp HD Videos : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై HD క్వాలిటీలో వీడియోలను పంపుకోవచ్చు తెలుసా?
హానర్ 90 5G స్పెసిఫికేషన్స్ (అంచనా) :
ట్విట్టర్ (X) ద్వారా కొత్త హ్యాండ్‌సెట్ రానున్నట్టు HTech కంపెనీ హింట్ ఇచ్చింది. 1.5K రిజల్యూషన్ TUV రైన్‌ల్యాండ్-సర్టిఫైడ్ డిస్‌ప్లేతో 1600nits గరిష్ట ప్రకాశం, 435ppi పిక్సెల్ సాంద్రత, 3840Hz PWM (పల్స్-వెడల్పు) మాడ్యూల్‌తో వస్తుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ హానర్ 90 5G స్పెసిఫికేషన్‌లకు సంబంధించి మైక్రోసైట్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత MagicOS 7.1పై రన్ అవుతుందని నివేదిక తెలిపింది. చైనీస్ కౌంటర్ మాదిరిగా 200MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది.

Honor 90 5G to Launch in India on September 14 Expected Price, Specifications
సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం, హ్యాండ్‌సెట్ 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండనుంది. Honor 90 5G చైనీస్ వేరియంట్ 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,200 x 2,664 పిక్సెల్‌లు) కర్వడ్ OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. Snapdragon 7 Gen 1 SoCతో రన్ అవుతుంది. గరిష్టంగా 16GB RAM, గరిష్టంగా 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో రానుంది. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో అందించనుంది.
భారత్‌లో Honor 90 5G ధర (అంచనా) :
హానర్ 90 5G ఫోన్ బేస్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,499 (దాదాపు రూ. 29వేలు ) ప్రారంభ ధర ట్యాగ్‌తో మేలో చైనాలో లాంచ్ అయింది. 16GB + 256GB, 16GB + 512GB వేరియంట్‌లు వరుసగా CNY 2,799 (దాదాపు రూ. 32,680), CNY 2,999 (దాదాపు రూ. 35,017)గా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ భారత ధర దీనికి అనుగుణంగా ఉండవచ్చు.
గత లీక్ ప్రకారం.. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 35వేలు ఉండవచ్చు. హానర్ 2020లో భారత్ నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు, మళ్లీ భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. భారత మార్కెట్లో హెచ్‌టెక్ (HTech) కార్యకలాపాలకు రియల్‌మి మాజీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ నాయకత్వం వహిస్తారు.