WhatsApp HD Videos : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై HD క్వాలిటీలో వీడియోలను పంపుకోవచ్చు తెలుసా?

WhatsApp HD Videos : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. హెచ్‌డీ క్వాలిటీలో ఫొటో-షేరింగ్ తర్వాత వాట్సాప్ HD సపోర్టుతో వీడియోలను పంపుకునేందుకు అనుమతిస్తోంది.

WhatsApp HD Videos : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై HD క్వాలిటీలో వీడియోలను పంపుకోవచ్చు తెలుసా?

WhatsApp now lets users share videos in HD, here is how it works

WhatsApp HD Videos : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) వినియోగదారులు ఇప్పుడు HD వీడియోలను షేర్ చేయవచ్చు. వినియోగదారులు ఇతరులతో షేర్ చేసే వీడియోలనుహై క్వాలిటీతో పంపుకోవచ్చు. గూగుల్ డాక్స్ (Google Docs) లింక్‌లు లేదా ఇతర ట్రాన్స్‌ఫర్ సర్వీసులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఫోటో-షేరింగ్ కోసం వాట్సాప్ HD సపోర్టును అందించిన కొన్ని రోజుల తర్వాత ఈ కొత్త ఫీచర్ వస్తుంది. ప్రస్తుతం.. ఈ ఫీచర్ Android, iOS యూజర్లకు అందుబాటులో ఉంది.

HD వీడియోలు, ఫొటోలను ఎలా పంపాలంటే? :
ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ముందుగా షేర్ చేయాలనుకునే ఫైల్‌ను ఎంచుకోవాలి. Send బటన్‌ను నొక్కే ముందు.. టాప్ కార్నర్‌లో HD ఐకాన్ కోసం Tap చేయండి. మీరు డిఫాల్ట్‌గా ప్రామాణిక క్వాలిటీ నుంచి రిజల్యూషన్‌ని HDకి మార్చవచ్చు. హై రిజల్యూషన్‌లో ఫొటోలు, వీడియోలను పంపడం ద్వారా ఎక్కువ డేటా, స్టోరేజ్ అవసరం పడుతుంది.

ఆసక్తికరంగా, వినియోగదారులు డౌన్‌లోడ్ చేయాలనుకునే HD రిజల్యూషన్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఫొటోను స్వీకరిస్తే.. స్టాండర్డ్ వెర్షన్‌ను ఉంచాలా లేదా HDకి అప్‌గ్రేడ్ చేయాలా అనేది మీరు ఫొటో-బై-ఫొటో ఆధారంగా ఎంచుకోవచ్చు.

Read Also : WhatsApp New Interface : వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ అదిరిందిగా.. టాప్ బార్ డిజైన్ ఇదేనట.. అందరికి కనిపిస్తుందా?

HD వీడియో షేరింగ్‌కి సపోర్టు చేసే సర్వర్ అప్‌డేట్‌గా కనిపిస్తోంది. అయినప్పటికీ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని యూజర్లకు సూచిస్తోంది. HDలో వీడియో, ఫొటో షేరింగ్ ఇంకా వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో అందుబాటులోకి రాలేదు. అయితే, వినియోగదారులు వెబ్ వెర్షన్ ద్వారా HD ఫైల్‌లను స్వీకరించవచ్చు. లేదంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp now lets users share videos in HD, here is how it works

WhatsApp now lets users share videos in HD, here is how it works

వాట్సాప్ ఈ ఏడాదిలో అప్‌డేట్‌లను అందించడంలో యాక్టివ్‌గా ఉంది. HDలో షేరింగ్ సపోర్టు కాకుండా, మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఏడాదిలో మల్టీ-ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్ రూపొందించింది. అత్యధికంగా డిమాండ్ చేసిన ఫీచర్ వినియోగదారులు ఒకే వాట్సాప్ అకౌంట్ వివిధ స్మార్ట్‌ఫోన్‌లలో ఏకకాలంలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇటీవల, వాట్సాప్ వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను ప్రకటించింది.

జూమ్ (Zoom), మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams), మీట్ (Meet) వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫీచర్ ఇప్పుడు సాధారణంగా అందుబాటులో ఉంది. పేరు సూచించినట్లుగా.. స్ర్కీన్ షేరింగ్ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఇతరులతో ఫోన్ స్ర్కీన్ చేసుకోవచ్చు. ఆఫీస్ కాల్స్ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ కొన్ని ఇతర ఫీచర్లను కూడా పరీక్షిస్తోంది. ఇటీవల, మెసేజింగ్ కంపెనీ త్వరలో ఒకే డివైజ్‌లో మల్టీ-అకౌంట్ సపోర్ట్‌ను రిలీజ్ చేయవచ్చని వెల్లడించింది. ఇప్పటికే వాట్సాప్ ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, (Facebook), (Instagram)లో (Meta)లో ఒకే డివైజ్‌లో మల్టీ-అకౌంట్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఆఫీసు, ఇంటికి వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

Read Also : UPI ATM Launched : డెబిట్ కార్డుతో పనిలేదు భయ్యా.. యూపీఐ ఏటీఎం ద్వారా ఈజీగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!