Honor X50 Launch : జూలై 5న హానర్ X50 కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. బ్యాటరీ వివరాలు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Honor X50 Launch : హానర్ కంపెనీ నుంచి సరికొత్త హానర్ X50 ఫోన్ రానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. బ్యాటరీ, ప్రాసెసర్ ఆకట్టుకునేలా ఉన్నాయని నివేదిక తెలిపింది.

Honor X50 Launch : జూలై 5న హానర్ X50 కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. బ్యాటరీ వివరాలు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Honor X50 SoC, Battery Details Confirmed, Spotted on Geekbench Ahead of July 5 Launch

Updated On : July 1, 2023 / 10:03 PM IST

Honor X50 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ హానర్ (Honor) నుంచి సరికొత్త Honor X50 ఫోన్ లాంచ్ కానుంది. సెప్టెంబరు 2022లో రిలీజ్ అయిన Honor X40కి సక్సెసర్‌గా జూలై మొదటి వారంలో (Honor X50) లాంచ్ కానుంది. హానర్ X40 ఫోన్ Adreno 619 GPU, 5,100తో చేసిన ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 695 SoCతో లాంచ్ చేసింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 40WmAh బ్యాటరీతో రానుంది.

ఇటీవలే షాంఘైలో జరిగిన 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో హానర్ మ్యాజిక్ V2 బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా జూలై 12న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హానర్ X50కి సంబంధించిన అనేక నివేదికలు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ముఖ్య స్పెసిఫికేషన్‌లను సూచిస్తున్నాయని కంపెనీ ధృవీకరించింది. ప్రాసెసర్, బ్యాటరీ వివరాలతో పాటు రాబోయే హ్యాండ్‌సెట్ బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లో గుర్తించింది.

Read Also : Tecno Camon 20 Premier 5G : జూలై 7న టెక్నో Camon 20 ప్రీమియర్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

గత నివేదికల ప్రకారం.. హానర్ X50 ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 6 Gen 1 SoCతో రానుంది. 35W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. పెద్ద 5,800mAh బ్యాటరీని కూడా అందిస్తుంది. ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం.. Honor X50 Adreno 710 GPUతో ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుందని Geekbench లిస్టు సూచించింది. ఈ ఫోన్ 12GB RAMతో వచ్చే అవకాశం ఉందని లిస్టులో పేర్కొంది.

Honor X50 SoC, Battery Details Confirmed, Spotted on Geekbench Ahead of July 5 Launch

Honor X50 SoC, Battery Details Confirmed, Spotted on Geekbench Ahead of July 5 Launch

ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ UI 7.1 అవుట్-ఆఫ్-ది-బాక్స్ రన్ అవుతుందని భావిస్తున్నారు. హానర్ X-సిరీస్ హ్యాండ్‌సెట్ 6.78-అంగుళాల 1.5K (2400 x 1220 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని గత నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోన్ వెనుక కెమెరా యూనిట్ 2MP సెన్సార్‌తో పాటు 108MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 512GB ఇంటర్నల్ స్టోరేజీతో అందిస్తోంది. Honor X50 ధర CNY 1,000 (దాదాపు రూ. 11,300) ఉంటుంది.

గత హానర్ X40 ఫోన్ Caiyun Chasing the Moon, Magic Night Black, Mo Yuqing (translated) కలర్ ఆప్షన్‌లలో 4 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తుంది. బేస్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,499 (సుమారు రూ. 17,100), అయితే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,699 (దాదాపు రూ. 19,400) వద్ద లిస్టు అయింది. హై-ఎండ్ 8GB RAM, 256GB స్టోరేజీ, 12GB RAM 256GB స్టోరేజీ ఆప్షన్లు వరుసగా CNY 1,999 (దాదాపు రూ. 22,800), CNY 2,299 (దాదాపు రూ. 26,200)గా ఉన్నాయి.

Read Also : MG Motor India : జూన్‌లో 14శాతం పెరిగిన ఎంజీ మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాలు.. 5,125 యూనిట్లు!