మీ ఫోన్లో FB Messenger వీడియోను Save చేయాలా?

  • Published By: sreehari ,Published On : January 1, 2020 / 09:44 AM IST
మీ ఫోన్లో FB Messenger వీడియోను Save చేయాలా?

సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఫన్నీ వీడియోలు కావొచ్చు.. ఫ్యామిలీ మూవెంట్స్ కావొచ్చు.. స్నేహితులు పంపిన ఫొటోలు కావొచ్చు.. లేదా మీ చిన్నప్పటి ఫొటోలు, వీడియోలను కుటుంబ సభ్యులు ఎవరైనా షేర్ చేసి ఉండొచ్చు. ఇలాంటి తీపి గుర్తులను భద్రంగా దాచుకోవాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో, ఫొటోలలో కొన్ని మెమరబుల్ మూవెంట్స్ ఉంటాయి. అలాంటి వాటిని దాచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. వెంటనే తమ ఫోన్లలో సేవ్ చేసుకుంటారు.

మీ ఫేస్ బుక్ మెసేంజర్‌లో కూడా ఇలాంటి బెస్ట్ మూవెంట్స్ వీడియోలు ఉన్నాయా? అయితే వీటిని ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదా? నిజానికి.. ఫేస్ బుక్ నుంచి నేరుగా షేర్ అయిన వీడియోలను సేవ్ చేయడం కుదరదు. అలా చేయాలంటే ఆ వీడియో ఫేస్ బుక్ మెసేంజర్ ద్వారా అప్ లోడ్ చేసి ఉంటేనే సాధ్యమవుతుంది. మీరు వాడే ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా ఈజీగా FB మెసేంజర్ నుంచి వీడియోలు సేవ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. అది ఎలానో ఓసారి చూద్దాం..

iPhoneలో వీడియో Save చేయాలంటే?:
* Facebook Messenger యాప్ ఓపెన్ చేయండి.
* మెసేంజర్ Chat boxలో Contacts ద్వారా వీడియో సెర్చ్ చేయండి.
* ఎవరి కాంటాక్ట్‌తో Conversationలో వీడియో ఉందో చెక్ చేయండి.
* Video ఫైల్ Hold చేసి పట్టుకోండి. ప్రీవ్యూ మోడ్ లో కనిపిస్తుంది.
* కొన్ని సెకన్ల పాటు Hold చేయగానే Save అనే ఆప్షన్ చేస్తుంది.
* ఫేస్‌బుక్‌లో ఒరిజినల్‌గా Upload చేసిన వీడియోలు మాత్రం Save చేయలేరు.
* ఇతరుల ఫోన్లో రికార్డు చేసిన వీడియోలను అప్ లోడ్ చేసినవే Save చేసుకోవచ్చు.
* వీడియో Save అయ్యాక FB మెసేంజర్ యాప్ క్లోజ్ చేయండి.
* మీ ఫోన్ Media Galleryలోకి వెళ్లి Save చేసి వీడియో వెతకండి.
* ఐఫోన్లలో Photo Appలో సేవ్ చేసిన వీడియోను ఎడిట్ చేసుకోవచ్చు.
* ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా వీడియోను ఇలానే Save చేసకోవచ్చు.
* Photo Appలో సేవ్ చేసిన వీడియోను మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.