Google Drive Offline : గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

Google Drive Offline : గూగుల్ డ్రైవ్ అనేది ఏదైనా డాక్యుమెంట్ లేదా ఫైల్స్ స్టోర్ చేసుకునే ప్లాట్‌ఫారంలా పనిచేస్తుంది. అయితే, గూగుల్ డ్రైవ్ ఇంటర్నెట్ లేకుండా యాక్సస్ చేయొచ్చుని తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Google Drive Offline : గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

How to access Google Drive offline

Updated On : November 14, 2023 / 6:59 PM IST

Google Drive Offline : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google Disk) డిస్క్ ఇప్పుడు వ్యక్తులు, వ్యాపారాలు రెండింటికీ కీలకమైన స్టోరేజీ టూల్‌గా మారింది. గూగుల్ స్టోరేజీ టూల్ ద్వారా డాక్యుమెంట్‌లు, ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైతే ఇతరులకు కూడా మీ డేటాను ఈజీగా షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం డేటా స్టోరేజీ కోసం అనేక ఆన్‌లైన్ ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ కనెక్షన్‌ని యాక్సెస్ చేయలేని సందర్భాలు ఉన్నాయి.

Read Also : Tech Tips in Telugu : మీ PCలో OS ఏదైనా సరే.. సింపుల్‌గా స్ర్కీన్‌షాట్ తీసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్ మీకోసం..!

అదృష్టవశాత్తూ, గూగుల్ డిస్క్ ఆఫ్‌లైన్ మోడ్‌ను కూడా అందిస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మీ ఫైల్‌లను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆఫ్‌లైన్‌లోనూ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా గూగుల్ డిస్క్‌ను ఆఫ్‌లైన్‌లో వినియోగించుకోవచ్చు. గూగుల్ డిస్క్‌ను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించడానికి మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ని ఎలా ఎనేబుల్ చేయాలి? మీరు కంప్యూటర్ లేదా మీ మొబైల్ డివైజ్‌లో కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

మీ కంప్యూటర్‌లో గూగుల్ డ్రైవ్ యాక్సస్ చేయాలంటే? :
1. గూగుల్ డిస్క్ వెబ్‌సైట్‌ (గూగుల్ డ్రైవ్)కి వెళ్లండి
2. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న గేర్ ఐకాన్ క్లిక్ చేయండి.
3. సెట్టింగ్‌లను ఎంచుకోండి.
4. ఆఫ్‌లైన్ కింద ‘ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ఈ డివైజ్ గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్‌ల ఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయడం, ఎడిట్ చేయడం, స్లయిడ్ బాక్సులను ఎంచుకోండి.
5. మార్పులను సేవ్ చేయి క్లిక్ చేయండి.

మీ మొబైల్ డివైజ్‌లో :
1. గూగుల్ డిస్క్ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ బటన్ నొక్కండి.
3. సెట్టింగ్స్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
4. ఆఫ్‌లైన్ యాక్సెస్‌ని నొక్కండి.
5. ‘ఆఫ్‌లైన్ యాక్సెస్’ పక్కన ఉన్న స్విచ్‌ని టోగుల్ చేయండి.

How to access Google Drive offline

How to access Google Drive offline

మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ని ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ కానప్పటికీ మీ ఇటీవలి గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్‌ల ఫైల్‌లను ఓపెన్ చేయొచ్చు లేదంటే ఎడిట్ చేయొచ్చు. అయితే, మీరు ఇటీవల ఓపెన్ చేయని ఫైల్‌లను మాత్రమ యాక్సెస్ చేయలేరని గమనించాలి.

ఆఫ్‌లైన్‌లో గూగుల్ డిస్క్ ఫైల్‌ని ఓపెన్ చేసేందుకు :

1. గూగుల్ డిస్క్ యాప్ లేదా గూగుల్ డ్రైవ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫైల్‌ల పక్కన యాష్ కలర్ చెక్‌మార్క్ ఉంటుంది. డాక్యుమెంట్ ఓపెన్ చేసి దానిపై నొక్కండి లేదా క్లిక్ చేయండి.

మీరు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో లేని ఫైల్‌ను యాక్సెస్ చేయాలనుకుంటే.. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి, డాక్యుమెంట్ పక్కన ఉన్న త్రి డాట్స్ నొక్కండి లేదా క్లిక్ చేయండి. ‘Make available offline’ ఎంచుకోండి. మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎప్పటిలాగే ఓపెన్ చేయొచ్చు లేదా ఎడిట్ చేయొచ్చు. మీరు చేసే ఏవైనా మార్పులు స్థానికంగా మీ డివైజ్‌లో సేవ్ అవుతాయి. మరో ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసినప్పుడు, మీ మార్పులు గూగుల్ డిస్క్‌కి సింకరైజ్ అవుతాయి.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటాను ఎలా అన్‌లాక్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!