Banking Scams : బ్యాంకింగ్ స్కామ్స్‌తో జర భద్రం.. ఈ గూగుల్ కొత్త ‘స్కామ్ ప్రొటెక్షన్’ ఫీచర్‌తో ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!
Banking Scams : మీకు ఏదైనా ఫేక్ స్పామ్ కాల్స్ వస్తే గూగుల్ కొత్త ఫీచర్ వెంటనే అలర్ట్ చేస్తుంది.. బ్యాంకింగ్ స్కామ్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాగంటే?
Banking Scams
Banking Scams : గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్యాంకింగ్ స్కామ్‌ల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు సరికొత్త ఫీచర్ వచ్చేసింది. ముందుగా గూగుల్ ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్ ఫీచర్ అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ను మార్కెట్లకు తీసుకువచ్చేందుకు టెక్ దిగ్గజం ఫిన్‌టెక్ యాప్‌లు, ఇతర బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
స్క్రీన్ షేరింగ్ సమయంలో ఏదైనా (Banking Scams) ఫైనాన్షియల్ యాప్‌ను వినియోగిస్తున్న సమయంలో మీకు తెలియని నంబర్ నుంచి కాల్‌లో వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఫైనాన్షియల్ స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు హెచ్చరిస్తుంది. కాల్ కట్ చేసేలా స్క్రీన్ షేరింగ్ ఆపేందుకు వన్-ట్యాప్ ఆప్షన్ కూడా అందిస్తుంది. గూగుల్ ఇంతకు ముందు యూకేలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది.
ఆండ్రాయిడ్ స్కామ్ ప్రొటెక్షన్ ఫీచర్ :
ఆండ్రాయిడ్‌లో ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్ కోసం పైలట్ ప్రోగ్రామ్‌ను అమెరికాలోని అన్ని ఫోన్లకు విస్తరిస్తున్నట్లు సెర్చ్ దిగ్గజం ప్రకటించింది. వినియోగదారులను ప్రొటెక్ట్ చేసేందుకు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్‌ను రిలీజ్ చేసేందుకు కంపెనీ క్యాష్ యాప్ జేపీ మోర్గాన్ చేజ్ వంటి బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆండ్రాయిడ్‌లో ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్ కోసం పైలట్ ప్రోగ్రామ్‌ను అమెరికాలోని ఫోన్లకు విస్తరిస్తున్నట్లు సెర్చ్ దిగ్గజం ప్రకటించింది.
ఈ ఫీచర్ ద్వారా ముఖ్యమైన డేటాను యాక్సెస్ చేయడం, డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం, హానికరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం, కాల్స్ సమయంలో వారి ఫోన్ స్క్రీన్‌లను షేర్ చేయమని స్కామర్లు యూజర్లను మోసం చేయకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఫేక్ ఐడెంటిటీ స్కామ్‌లను ఎదుర్కొవచ్చు. ఈ క్యాంపెయిన్ కింద ఒక యూజర్ తమ స్క్రీన్‌ను షేర్ చేసేందుకు ప్రయత్నించినా ఫైనాన్షియల్ యాప్ ఓపెన్ చేసి తెలియని నంబర్ నుంచి కాల్ చేసినా కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ముందుగానే అలర్ట్ చేస్తుంది.
యూజర్లను వెంటనే ఫోన్ కాల్ కట్ చేయమంటూ ఎండ్ ఆప్షన్ కూడా వస్తుంది. అలాగే ఫోన్ కాల్ కొనసాగిస్తే.. అడ్వాన్స్ అలర్ట్‌లో 30-సెకన్ల పాజ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో అది ఫేక్ కాల్ లేదా స్కామర్ అనేది డిటెక్ట్ చేసేందుకు కొంత సమయం ఇస్తుందని గూగుల్ పేర్కొంది.
ఫైనాన్షియల్ యాప్‌లకు కాల్‌లో ప్రొటెక్షన్ కల్పించేందుకు గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో యూకేలో ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అనుమానాస్పద కాల్స్, స్కామ్‌ల బారి నుంచి వేలాది మంది యూజర్లను ప్రొటెక్ట్ చేసిందని కంపెనీ పేర్కొంది. గూగుల్ బ్రెజిలియన్ భారతీయ మార్కెట్లలో కూడా ఇలాంటి పైలట్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను అనేక ప్రధాన యూకే బ్యాంకులకు విస్తరించింది.
