WhatsApp Group : మీ ఆండ్రాయిడ్ ఫోన్ వాట్సాప్ గ్రూపులో Disappearing Messages ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?
WhatsApp Group : మెటా-యాజమాన్యమైన ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ యూజర్ల కోసం అనేక ఏళ్లుగా మల్టీ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో కొత్త ఫీచర్ అదృశ్యమయ్యే మెసేజ్‌లు (disappearing messages) అని కూడా పిలుస్తారు.

How to turn disappearing messages on or off in a WhatsApp group on Android phone
WhatsApp Group : మెటా-యాజమాన్యమైన ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ యూజర్ల కోసం అనేక ఏళ్లుగా మల్టీ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో కొత్త ఫీచర్ అదృశ్యమయ్యే మెసేజ్‌లు (disappearing messages) అని కూడా పిలుస్తారు. వాట్సాప్ మెసేజ్‌లను పంపిన 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల తర్వాత ఆయా మెసేజ్‌లను అదృశ్యమయ్యేలా సెచ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న మల్టీ చాట్‌లు అలాగే గ్రూప్ చాట్‌లలో అదృశ్యమయ్యే మెసేజ్ ఆప్షన్ ఆన్ చేసేందుకు WhatsApp యూజర్లకు అనుమతిస్తుంది.
ఈ ఫీచర్ ఒకసారి ఎనేబుల్ చేస్తే చాలు.. మీ వాట్సాప్ చాట్‌లో పంపిన కొత్త మెసేజ్‌లు యూజర్ ఎంచుకున్న వ్యవధి తర్వాత ఆటోమాటిక్‌గా అదృశ్యమవుతాయి. ఇలా అదృశ్యమయ్యే మెసేజ్‌లను ప్రారంభించే ముందు పంపిన లేదా స్వీకరించిన మెసేజ్‌లపై ఫీచర్ ప్రభావం ఉండదని గుర్తించాలి.
వాట్సాప్ గ్రూప్ చాట్‌లో.. వాట్సాప్ ఏ గ్రూప్ పార్టిసిపెంట్ అయినా disappearing messages ఎనేబుల్/డిజేబుల్ చేసేందుకు అనుమతిస్తుంది. disappearing messages ఎనేబుల్ చేయడానికి అడ్మిన్‌లను మాత్రమే అనుమతించేలా గ్రూప్ అడ్మిన్ గ్రూప్ సెట్టింగ్‌లను మార్చవచ్చు. గ్రూప్ చాట్‌లలో అదృశ్యమయ్యే మెసేజ్‌లను ఎలా On/Off చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? Android యూజర్లు ఈ కింది విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
1. మీ ఫోన్‌లో వాట్సాప్ (Whatsapp) ఓపెన్ చేసి గ్రూప్ చాట్‌కి వెళ్లండి.
2. అదృశ్యమవుతున్న మెసేజ్‌లను మీరు ప్రారంభించే గ్రూప్ పేరుపై Tap చేయండి.
3. disappearing messagesపై నొక్కండి.
4. ప్రాంప్ట్ కాగానే ‘Continue’ Tap చేయండి.
5. అదృశ్యమయ్యే మెసేజ్‌ల్లో టైమ్ లిమిట్ ఎంచుకోవచ్చు. 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులు ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
6. మీరు ఏ చాట్‌లను ప్రారంభించాలో ముందుగానే ఎంచుకోండి.
7. Completedపై Tap చేయండి. ఎంపిక చేసిన గ్రూప్ చాట్‌లో disappearing messages ఇప్పుడు వర్క్ అవుతుంది.
మీరు కొత్త గ్రూప్ చాట్‌ని క్రియేట్ చేసేటప్పుడు disappearing messages కూడా సెట్ చేసుకోవచ్చు.

How to turn disappearing messages on or off in a WhatsApp group on Android phone
Disappearing Messages ఎలా Stop చేయాలంటే? :
Group Admin వాట్సాప్ గ్రూపులోని అడ్మిన్‌లకు మాత్రమే లిమిట్ చేస్తే తప్ప.. గ్రూప్ చాట్‌లోని ఎవరైనా disappearing messages ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. disappearing messages నిలిపివేయడానికి ఈ కిందివిధంగా ఫాలో అవ్వండి.
1. WhatsApp ఓపెన్ చేయండి. మీరు disappearing messages నిలిపివేసి గ్రూప్ చాట్‌పై Tap చేయండి.
2. గ్రూపులో పేరును Tap చేయండి.
3. disappearing messages ఆప్షన్ వద్ద Tap చేయండి. ప్రాంప్ట్ అయితే Continue ఆప్షన్ వద్ద Tap చేయండి.
4. Off ఎంచుకోండి.
5. పూర్తి చూసేందుకు Completed అనే ఆప్షన్ Tap చేయండి.