Humane AI Pin : ప్రపంచంలోనే ఫస్ట్ డిస్‌ప్లే-లెస్ డివైజ్.. ఇక స్మార్ట్‌ఫోన్లతో పనిలేదు.. ఈ ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే?

Humane AI Pin : ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే లెస్ స్మార్ట్‌ఫోన్ ఏఐ పిన్‌ను హ్యూమన్ రిలీజ్ చేసింది. ఈ డివైజ్ ఈజీగా ధరించవచ్చు. షర్ట్‌కు క్లిప్ లాగా పెట్టుకోవచ్చు. చాట్‌జీపీటీ, బింగ్ ఏఐ వంటిఏఐ టెక్నాలజీతో ఈ డివైజ్ పనిచేస్తుంది.

Humane AI Pin : ప్రపంచంలోనే ఫస్ట్ డిస్‌ప్లే-లెస్ డివైజ్.. ఇక స్మార్ట్‌ఫోన్లతో పనిలేదు.. ఈ ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే?

Humane AI Pin _ 5 things to know about world’s first display-less smartphone

Humane AI Pin : ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ యుగం.. రోజురోజుకీ కొత్త ఏఐ స్మార్ట్ డివైజ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు లేకుండా ఊహించుకోవడమే కష్టం.. అలాంటిది స్మార్ట్‌ఫోన్లకు చెక్ పెట్టేందుకు కొత్త ఏఐ డివైజ్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. హ్యూమన్ ఏఐ పిన్ (Humane AI Pin) డివైజ్. ఆపిల్ కంపెనీ మాజీ ఉద్యోగులు ఈ హ్యూమన్ (Humane) అనే కంపెనీని స్థాపించగా.. లేటెస్గుగా ఈ కొత్త ‘ఏఐ పిన్’‌ను రూపొందించారు.

టెక్ ప్రపంచంలో ఇప్పుడు హ్యూమన్ ఏఐ పిన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ డివైజ్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేదానిపై క్లారిటీ లేదు. కానీ, ఎక్కడ చూసినా ఈ ఏఐ పిన్ గురించే చర్చ నడుస్తోంది. ప్రతిఒక్కరూ ఈ ఏఐ పిన్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అసలు ఈ ఏఐ డివైజ్ ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఆసక్తికరమైన ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి..

Humane AI Pin _ 5 things to know about world’s first display-less smartphone

Humane AI Pin launched by Humane

మీ టీషర్టుపై ఏఐ పిన్ ధరించవచ్చు :
ఆపిల్ మాజీ ఉద్యోగులైన ఇమ్రాన్ చౌదరి, బెథానీ బొంగియోర్నో కలిసి హ్యూమన్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఈ ఏఐ డివైజ్ పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గత వారమే హ్యూమన్ ఏఐ పిన్ అనే మొదటి ఉత్పత్తిని ప్రారంభించింది. చూసేందుకు చాలా చిన్నదిగా కనిపించే ఈ డివైజ్‌లో స్మార్ట్‌ఫోన్ మాదిరిగా డిస్‌ప్లే ఉండదు. చక్కగా మీ టీ-షర్టుపై ఈ ఏఐ పిన్‌ని ధరించవచ్చు లేదా మీ వర్క్ డెస్క్‌పై క్లిప్ చేయవచ్చు.

Read Also : ChatGPT APP: ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులోకి చాట్ జీపీటీ యాప్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

ఈ డివైజ్‌కు స్క్రీన్ ఉండదు.. కానీ, ఒక స్మార్ట్‌ఫోన్ చేసే అన్ని పనులు చేయగలదు. అంటే.. మెసేజ్‌లు పంపుకోవచ్చు.. ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.. ఫొటోలు తీయొచ్చు. నోట్స్ రాసుకోవచ్చు. ఇవన్నీ ఏఐ డివైజ్‌ ఎలా చేస్తుందంటే.. చాట్ జీపీటీ (ChatGPT) బింగ్ ఏఐ (Bing) ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.

హ్యూమన్ ఏఐ పిన్ గురించి ఆసక్తికరమైన 5 విషయాలు ఇవే :

ఏఐ పిన్ వేరేబుల్ స్మార్ట్‌ఫోన్ లాంటిది :
నిఫ్టీ ల్యాపెల్ పిన్‌ని కలిగిన డివైజ్.. మొత్తం స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ, ఇందులో డిస్‌ప్లే మైనస్.. హ్యూమన్ అందించిన ఈ చిన్న అద్భుతం మీ సాధారణ స్మార్ట్‌ఫోన్ చేసే ప్రతి పనిని చిటికెలో పూర్తి చేయగలదు. అయితే, మీరు రోజంతా తదేకంగా చూసేది కాదు. సింపుల్‌గా మీ చొక్కాపై క్లిప్‌లా పెట్టుకోవచ్చు. అరచేతిలో డిస్‌ప్లే కనిపిస్తుంది. మీరు ఏఐ డివైజ్‌తో మాట్లాడుకోవచ్చు. అంతేకాదు.. ప్రొజెక్టర్ మాదిరిగా డిస్‌ప్లే మరింత పెంచుకోవచ్చు.

Humane AI Pin _ 5 things to know about world’s first display-less smartphone

Humane AI Pin smartphone

స్మార్ట్‌ఫోన్ లేని ప్రపంచమే హ్యూమన్ విజన్ :
ఒక ఏడాది పాటు ఊరించిన తర్వాత, హ్యూమన్ కంపెనీ ఏఐ పిన్‌ను రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఇక స్మార్ట్‌ఫోన్‌లతో పనిలేదనే విషయాన్ని సూచిస్తుంది. మనిషి జీవితంపై ఆధిపత్యం చెలాయించే స్మార్ట్‌ఫోన్‌లను ఇక మరచిపోవాల్సిందే.. ఏఐ పిన్ మీ రోజువారీ పనుల్లో వేగంగా అన్నింటిని క్షణాల్లో చక్కపెట్టేయగలదు.

ఏఐ పిన్ ధరించవచ్చు.. ఏకంగా మాట్లాడవచ్చు :
ఏఐ పిన్ ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. మీ చొక్కాకి ఎక్కడైనా ధరించవచ్చు. వాయిస్ ఎనేబుల్ అయి ఉండటం వల్ల మీ దుస్తులపై ఎక్కడైనా ఈజీగా ధరించవచ్చు. ఒకవేళ మీరు డెస్క్‌ దగ్గర పనిచేస్తుంటే.. దాన్ని మీ వర్క్‌స్పేస్‌లో క్లిప్ చేసుకుంటే చాలు.. దాని పని అదే పూర్తిచేస్తుంది.

Humane AI Pin _ 5 things to know about world’s first display-less smartphone

Humane AI Pin display-less smartphone

ఏఐ మ్యాజిక్.. అరచేతిపై వాయిస్ కమాండ్స్ :
గ్రీన్ లేజర్‌ను ఉపయోగించి.. ఏఐ పిన్ మీ అరచేతిపై సమాచారాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. మీ చేతిని స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ మాదిరిగా మారుస్తుంది. కాల్‌లు చేయడం లేదా మెసేజ్‌లను టైప్ చేసేందుకు మీ అరచేతిని ట్యాప్ చేసే సరిపోతుంది. ఈ డివైజ్‌లో 13ఎంపీ కెమెరాను మాన్యువల్‌గా యాక్టివ్ చేసేందుకు టచ్‌ప్యాడ్‌ను కూడా కలిగి ఉంది.

టెక్ స్పెషిఫికేషన్లు, సబ్‌స్క్రిప్షన్, ధర ఎంతంటే? :
ఈ ఏఐ పిన్ డివైజ్ (Cosmos OS) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. చాట్ జీపీటీ, బింగ్ జనరేటివ్ ఏఐ టూల్స్ ట్యాప్ చేస్తుంది. ఇందులోని క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ సహా మోషన్ సెన్సార్లు, 13ఎంపీ కెమెరా మరిన్నింటిని కలిగి ఉంది. ఈ చిన్నపాటి ఏఐ పిన్‌ డివైజ్.. పవర్‌హౌస్, ఎక్లిప్స్, ఈక్వినాక్స్, లూనార్ అనే మూడు కూల్ వేరియంట్‌లలో లభిస్తుంది.

ఈ పిన్ బరువు 34గ్రాములు ఉండగా.. డివైజ్ ధర 699 డాలర్లు ఉంటుంది. నెలకు 24 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ పిన్ మోడల్ అమెరికాలోని టీ-మొబైల్‌లో ముందుగా లభిస్తోంది. ఏఐ పిన్ డివైజ్ ప్రీ-ఆర్డర్‌లు నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఏఐ పిన్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Read Also : Tech Tips in Telugu : ChatGPT ఇప్పుడు మాట్లాడగలదు.. వినగలదు.. చూడగలదు.. ఈ కొత్త ఏఐ వాయిస్, ఇమేజ్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?