Apple iMessage App : ‘ఐమెసేజ్’ యాప్ ఆపిల్‌ డివైజ్‌లకు మాత్రమేనా..? ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రావచ్చు..!

iMessage Stop : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. త్వరలో మీ ఐఫోన్లలో ఐమెసేజ్ (iMessage) యాప్ నిలిచిపోనుంది. ఇకపై వాట్సాప్ మాదిరిగానే ఐమెసేజ్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పనిచేయనుంది.

Apple iMessage App : ‘ఐమెసేజ్’ యాప్ ఆపిల్‌ డివైజ్‌లకు మాత్రమేనా..? ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రావచ్చు..!

iMessage may soon stop being an Apple-only app

Apple iMessage App : ఆపిల్ ఐఫోన్లలో ఐమెసేజ్ యాప్ త్వరలో నిలిచిపోనుంది. అంటే.. పూర్తిగా కాదండోయ్.. ఇప్పటివరకూ ఆపిల్ డివైజ్‌లో మాత్రమే పనిచేసిన ఈ యాప్ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పనిచేయనుంది. ఆపిల్ డివైజ్‌లైన ఐఫోన్లు, మ్యాక్స్, ఆపిల్ వాచ్‌లకు ప్రత్యేకమైన ఈ ఐమెసేజ్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ మాదిరిగా పని చేయనుంది. దీనిపై గూగుల్, ఈయూ కలిసి పని చేస్తున్నాయి. ఆపిల్ డివైజ్‌ల్లో మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు కూడా సపోర్టును విస్తరించాలని పట్టుబడుతున్నాయి.

బ్లూ vs గ్రీన్ అనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి, ఆపిల్ డివైజ్‌లకు ఐమెసేజ్ ప్రత్యేకతను ముగించాలని, (RCS) మెసేజింగ్ సర్వీసును స్వీకరించాలని పట్టుబట్టేందుకు గూగుల్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో కలిసి చాలా కాలంగా ఆపిల్‌‌ని కోరుతోంది. ఇన్నాళ్లుగా, గూగుల్ ఆర్‌సీఎస్ సర్వీసును వినియోగించుకోవాలని ఆపిల్‌కు చెబుతూనే వస్తోంది.

Read Also : Yamaha Diwali Offers : యమహా దీపావళి స్పెషల్ ఆఫర్లు.. ఎఫ్‌జెడ్, ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ మోడళ్లపై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్స్!

నివేదిక ప్రకారం.. ఐమెసేజ్ ‘కోర్’ సర్వీసుగా గుర్తించాలని ఈయూని కోరుతూ గూగుల్ యూరోపియన్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌లతో కలిసి ఒక లేఖపై సంతకం చేసింది. అందులో మొదటిది.. ఐరోపాలో తగినంత మంది యూజర్లు ఐమెసేజ్ ఉపయోగిస్తున్నారని గూగుల్, ఈయూ గుర్తించాలని కోరుకుంటున్నాయి. తద్వారా డిజిటల్ మార్కెట్ల చట్టం కిందకు వస్తుంది. రెండోది.. ఆపిల్ ఆండ్రాయిడ్, ఆపిల్ డివైజ్ వాడే వినియోగదారుల మధ్య మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, ఆర్‌సిఎస్ మెసేజింగ్ ప్రమాణాన్ని అవలంబించాలని గూగుల్ వాదిస్తోంది.

ఆపిల్ ఫోన్లలోనే కాదు.. ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా  :

ముఖ్యంగా, ఐమెసేజ్ ఇకపై ఐఫోన్, ఆపిల్ వాచ్ లేదా మ్యాక్ యూజర్లు మాత్రమే ఉపయోగించగల సర్వీసు కాదని దీని అర్థం. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ వంటి విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలోని డివైజ్‌లలోనూ వాట్సాప్ మాదిరిగా పనిచేస్తుంది. ఐమెసేజ్ కూడా ఈ సపోర్టును పొందవచ్చు. ప్రస్తుతం, ఆపిల్ యూజర్లు ఐమెసేజ్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు మెసేజ్ పంపవచ్చు. అయితే, ఇది గ్రీన్ బబుల్‌లో ఎస్ఎంఎస్ టెక్స్ట్‌గా వెళుతుంది. ఐమెసేజ్ సర్వీసు ప్రారంభించిన ఆపిల్ డివైజ్ వాడే వినియోగదారులు మాత్రమే బ్లూ బబుల్ మెసేజ్ పంపగలరు. హై-రిజల్యూషన్ మెసేజ్‌లు, వీడియోలు లేదా స్టిక్కర్‌లను పంపడం, ఇతర మల్టీమీడియాను ఉపయోగించడం వంటి అన్ని ఐమెసేజ్ ఫీచర్‌లు ఆపిల్ డివైజ్‌లను వినియోగదారులకు ప్రత్యేకంగా ఉంటాయి.

iMessage may soon stop being an Apple-only app

iMessage soon stop Apple-only app

ఐమెసేజ్ కేవలం ఐఫోన్లకు మాత్రమే ఉంచడం చాలా అన్యాయమని గూగుల్ భావిస్తోంది. ఆపిల్ ఆండ్రాయిడ్, ఆపిల్ డివైజ్‌ల మధ్య మెసేజ్‌లను ఆర్‌సిఎస్ ప్రమాణాన్ని ఉపయోగించకుండా ఎస్ఎంఎస్, ఎమ్‌ఎమ్‌ఎస్‌ (MMS)లుగా మార్చడం ద్వారా మెసేజింగ్ సర్వీసును దిగజార్చుతుందని గూగుల్ చెబుతోంది. అయితే, వాస్తవానికి, దీనిపై చర్య తీసుకోవాలని ఈయూ ఆపిల్‌ను కోరితేనే ఇది జరుగుతుంది. ప్రస్తుతం, గూగుల్, యూరోపియన్ క్యారియర్‌లు చర్య తీసుకోవాలని ఈయూ మాత్రమే అభ్యర్థించాయి. కానీ, అధికారికంగా ఇంకా ఏది జరగలేదు. ఈయూ సర్వీసు తగినంత ‘కోర్’ అని లేదా పెద్ద సంఖ్యలో యూజర్లను ప్రభావితం చేస్తే మాత్రమే అమల్లోకి వస్తుందని నివేదిక తెలిపింది.

బ్లూ వర్సెస్ గ్రీన్ వాదన.. ఆర్‌సిఎస్ సర్వీసుకు మారాల్సిందే  : 
అలాగే, ఆండ్రాయిడ్ కొన్నేళ్లుగా ఆపిల్ ఆర్‌సిఎస్ మెసేజింగ్ సర్వీస్‌ను అవలంబించడంపై పట్టుదలతో ఉంది. ఆపిల్ కూడా అంతే మొండిగా వ్యవహరిస్తోంది. బ్లూ వర్సెస్ గ్రీన్ వాదన రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ఆపిల్ ఐమెసేజ్ సర్వీసును ఈయూలో 45 మిలియన్ల మంది వినియోగదారులు మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఎక్కువ మంది వ్యక్తులను ప్రభావితం చేయలేదని వాదించారు. ఒకవేళ ఐమెసేజ్ వారి అనుభవాన్ని నాశనం చేస్తే.. ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్ వంటి ఇతర సర్వీసులను ఉచితంగా ఉపయోగించుకోవచ్చునని ఆపిల్ తెలిపింది. అయినప్పటికీ, ఐమెసేజ్ యాప్‌ను వినియోగదారుల కోసం మాత్రమే సర్వీసుగా ఉంచాలని పట్టుబట్టింది.

Read Also : Whatsapp Ads : వాట్సాప్‌‌లో త్వరలో స్టేటస్, ఛానల్స్‌లో యాడ్స్ చూడొచ్చు.. ఇందులో నిజమెంత?