Infinix Note 50X 5G : గేమర్లకు గుడ్ న్యూస్.. ఏఐ టెక్నాలజీతో కొత్త ఇన్ఫినిక్స్ 5G ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్..!

Infinix Note 50X 5G Launch : అతి త్వరలో భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5జీ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే ఇన్ఫినిక్స్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను రివీల్ చేసింది.

Infinix Note 50X 5G : గేమర్లకు గుడ్ న్యూస్.. ఏఐ టెక్నాలజీతో కొత్త ఇన్ఫినిక్స్ 5G ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్..!

Image Source : INFINIX NOTE 50X

Updated On : March 21, 2025 / 6:28 PM IST

Infinix Note 50X 5G Launch : ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి అతి త్వరలో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ రానుంది. ఇన్ఫినిక్స్ అధికారికంగా ఈ నోట్ 50X 5G లాంచ్‌ను ప్రకటించింది. మార్చి 27 (2025)న లాంచ్ కానుంది.

లాంచ్‌కు ముందే కంపెనీ ధర, చిప్‌సెట్, బ్యాటరీ కెపాసిటీ, ఏఐ ఆధారిత ఫీచర్లతో సహా ఫోన్ గురించి కీలక వివరాలను వెల్లడించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ రాబోయే ఇన్ఫినిక్స్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.

Read Also : iPhone 15 Price Cut : అబ్బబ్బా భలే ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15.. ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా చీప్ గురూ..!

ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G భారత్ ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ ధర రూ. 12వేల లోపు ఉంటుంది. మార్కెట్లో అత్యంత సరసమైన 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇన్ఫినిక్స్ కంపెనీ అధికారిక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్‌ను కలిగిన ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్, లాగ్-ఫ్రీ గేమింగ్ కోసం రూపొందించారు. ఇది సెకనుకు 90 ఫ్రేమ్‌లు (fps) వరకు సపోర్టు ఇస్తుంది.

5500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh సాలిడ్‌కోర్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. పదేపదే ఛార్జింగ్ చేయకుండా అధిక వినియోగాన్ని అందిస్తుంది. అదనంగా, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇన్ఫినిక్స్ యూజర్లు తమ ఫోన్లను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తుందని ధృవీకరించింది. కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్ కలిగి ఉంది.

ఏఐ ఆధారిత XOS 15 ఫీచర్లు ఇవే :
ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ XOS 15పై రన్ అవుతుంది. AI-ఆధారిత అప్‌గ్రేడ్స్ అందిస్తుంది.
ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్ : సిస్టమ్ యాక్షన్స్, వెబ్ కంటెంట్ యానాలిసిస్, టాస్క్ ఎగ్జిక్యూషన్ ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్స్
ఏఐ నోట్ ఫీచర్ : శాంసంగ్ స్కెచ్-టు-ఇమేజ్ ఫీచర్ స్కెచ్‌లను డిజిటల్ ఆర్ట్‌గా మారుస్తుంది.
AIGC పోర్ట్రెయిట్ : రియల్-టైమ్ ఫొటోల ఆధారంగా ఏఐ జనరేటెడ్ అవతార్ ఉపయోగిస్తుంది.
డైనమిక్ బార్ : ఇంటరాక్టివ్ యూఐ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫోల్డబుల్ నోటిఫికేషన్ బార్ ఉంటుంది.
గేమ్ మోడ్ : మెరుగైన గేమింగ్ కోసం కస్టమైజడ్ పర్ఫార్మెన్స్ మోడ్‌లను అందిస్తుంది.

Read Also : iPhone 16e Price : కొత్త ఐఫోన్ 16eపై అద్భుతమైన ఆఫర్.. కేవలం రూ.55వేల లోపు ధరలో.. ఇంకా తగ్గాలంటే ఇలా చేయండి!

అత్యాధునిక AI ఫీచర్లు, పవర్‌ఫుల్ చిప్‌సెట్, బడ్జెట్-ఫ్రెండ్లీ ధరతో ఇన్ఫినిక్స్ నోట్ 50X 5జీ ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీదారుగా నిలువనుంది. ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50x ఫోన్ మార్చి 27న అధికారిక లాంచ్ కానుంది.