Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఈ నెల 17నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Infinix Zero Flip Launch : కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రపంచవ్యాప్తంగా బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్‌వేస్‌లో లాంచ్ కానుంది.

Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఈ నెల 17నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Infinix Zero Flip India Launch Date Set for October 17_ Expected Specifications, Features

Updated On : October 6, 2024 / 4:44 PM IST

Infinix Zero Flip Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి త్వరలో మడతబెట్టే ఫోన్ వస్తోంది. ఇన్ఫినిక్స్ కంపెనీ మొట్టమొదటి క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ గత నెలలో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ మడతబెట్టే ఫోన్ అక్టోబర్ మధ్య నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ట్రాన్స్‌షన్ యాజమాన్యంలోని కంపెనీ ధృవీకరించింది.

Read Also : iPhone SE 4 Leaks : అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 3.64-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు 6.9-అంగుళాల లోపలి స్క్రీన్‌ను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ ఔటర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అయితే, మూడో 50ఎంపీ కెమెరా లోపలి స్క్రీన్‌పై హోల్-పంచ్ కటౌట్‌తో రానుంది.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఇండియా లాంచ్ తేదీ :
కంపెనీ వెబ్‌సైట్‌లోని మైక్రోసైట్ ప్రకారం.. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రపంచవ్యాప్తంగా బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్‌వేస్‌లో లాంచ్ కానుంది. అయితే, రెండో వేరియంట్ మాత్రమే దేశ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ధర, లభ్యత వంటి ఇతర వివరాలు లాంచ్‌కు ముందు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ మోడల్ మాదిరిగానే స్పెసిఫికేషన్‌లతో వస్తుందని భావిస్తున్నారు. మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌తో వస్తుంది. గరిష్టంగా 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఎక్స్ఓఎస్ 14పై రన్ అవుతుందని భావిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ లోపల 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, 3.64-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లే కూడా 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఫొటోలు, వీడియోలకు జీరో ఫ్లిప్ 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. లోపలి డిస్‌ప్లేలో 50ఎంపీ కెమెరా కూడా ఉంది. లోపలి, బయటి కెమెరాలను ఉపయోగించి కూడా 4కె వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

కంపెనీ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ గోప్రో ఇంటిగ్రేషన్‌ను కూడా అందిస్తుంది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ జేబీఎల్ ద్వారా ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. రెండు ఓఎస్ అప్‌గ్రేడ్‌లను (ఆండ్రాయిడ్ 16 వరకు) అందుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ అడాప్టర్‌ని ఉపయోగించి 70డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 4,720mAh బ్యాటరీని కూడా అందిస్తుంది.

Read Also : Oppo Find X8 Launch : ఒప్పో ఫైండ్ X8 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్..!