Apple iPhones : ఐఫోన్ 13 సేల్స్ స్టార్ట్

ఇండియాతో పాటు...కెనడా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్, జపాన్, యూకేతో పాటు మరో 30 దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అమ్మకాలు స్టార్ట్ అయ్యయి.

Apple iPhones : ఐఫోన్ 13 సేల్స్ స్టార్ట్

Iphone

Updated On : September 25, 2021 / 11:49 AM IST

iPhone 13 : ఐ ఫోన్స్ 13 సేల్స్ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. దీంతో సెల్ ఫోన్ లవర్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. 2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే సేల్స్ ప్రారంభమైనట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లను కొనుక్కోవడానికి…యాపిల్ స్టోర్ ఆన్ లైన్, ఇతర ఈ కామర్స్ సైట్లలో ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఫోన్ లను డెలివరీ చేస్తారు.

Read More : part time jobs : అమెజాన్ లో 1,10,000 ఉద్యోగాలు

ఇండియాతో పాటు…కెనడా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్, జపాన్, యూకేతో పాటు మరో 30 దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు అమ్మకాలు స్టార్ట్ అయ్యయి. అయితే..ఆన్ లైన్ లో కాకుండా..ఆఫ్ లైన్ కొనుక్కోవాలని అనుకుంటారు కొందరు. భారతదేశ వ్యాప్తంగా…విజయ్ సేల్స్, రిలయెన్స్ డిజిటల్, క్రోమో స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు.

Read More : UPSC..నేషనల్ ఢిఫెన్స్,నావల్ అకాడమీ ఎగ్జామ్ కి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు

ఐఫోన్ 13 సిరీస్ విషయానికి వస్తే… ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 13 మినీ ఫోన్లు సేల్‌ అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 13 బేసిక్ వేరియంట్ ధర రూ. 79 వేల 900 ఉండగా..ఐ ఫోన్ 13 ప్రొ 1 టీబీ వెరియంట్ ధర రూ. 1,69,900గా ఉంది. ఐఫోన్ 13 ప్రో 128 జీబీ వెరియంట్ ధర రూ. 1,99,900, 256 జీబీ వెరియంట్ ధర రూ. 1,29,900, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,49,900గా ఉంది.