Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 14 ధర రూ.40వేల లోపే.. అబ్బా భలే డీల్ కదా.. టెంప్ట్ అయ్యారా? ట్రాప్‌లో పడినట్టే..!

Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లను చూడగానే తొందరపడి కొనేయకండి.. ఎందుకో తెలుసా?

Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 14 ధర రూ.40వేల లోపే.. అబ్బా భలే డీల్ కదా.. టెంప్ట్ అయ్యారా? ట్రాప్‌లో పడినట్టే..!

iPhone 14 under Rs 40K on Amazon_ Deal sounds great, but you shouldn't fall for it

Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్.. దీని రేంజే వేరబ్బా.. చాలామందికి లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ (Apple iPhone) వాడాలని ఉంటుంది. ఎందుకంటే.. ఐఫోన్ చేతిలో ఉందంటే ఆ దర్జానే వేరు.. లక్షలు పోసి కొనాల్సిన లగ్జరీ ఐఫోన్ తక్కువ ధరకే వస్తుందంటే ఎవరూ మాత్రం వద్దంటారు చెప్పండి.. అప్పు చేసి అయినా ఐఫోన్ కొనేందుకు రెడీ అంటారు.. ఐఫోన్లపై ఆఫర్లు అనగానే ఎవరైనా టెంప్ట్ అవుతారు.. అందులోనూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాల్లో సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఇలాంటి ఆఫర్ల విషయంలో కొంచెం అలర్ట్ ఉండకపోతే.. మీ జేబుకు చిల్లు పడక తప్పదు.. తీరా కొనబోయే సరికి రేటు ఎక్కువ ఉందని తెలిస్తే ఇక నిరుత్సాహపడాల్సిందే మరి..

అయితే, అమెజాన్ (Amazon)లో మే 4న గ్రేట్ సమ్మర్ సేల్‌ (Amazon Great Summer Sale)ను నిర్వహించనుంది. ఈ సేల్ ఈవెంట్‌లో ఆపిల్ iPhone 14 వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండనున్నాయి. ఈ సేల్‌లో, బ్యాంక్ ఆఫర్‌లు, అమెజాన్ రివార్డ్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో సహా ఆపిల్ (iPhone 14) 128GB స్టోరేజీ ధర రూ. 40వేలు అంటూ కంపెనీ వెల్లడించింది. ఆపిల్ స్టోర్స్‌లో అసలు ధర రూ. 79,900 నుంచి తగ్గింది. ఈ డీల్ చూస్తుంటే గ్రేట్ అనిపిస్తుంది కదా.. అయితే మీరు అనుకున్నంతగా ఉండకపోవచ్చు. మీరు ఇప్పటికీ ఈ సేల్‌లో రూ. 10వేల తగ్గింపుతో ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read Also : Top 10 Selling Cars 2023 : ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో..!

అమెజాన్ ఆఫర్ టీజర్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై రూ. 12,901 ధర తగ్గింపును సూచిస్తోంది. ఐఫోన్ 14 తరచుగా (Amazon), (Flipkart)లో అసలు ధర కన్నా తక్కువగా ఆఫర్ చేస్తున్నాయి. దాంతో ఈ ఆఫర్ చూడగానే కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.. అమెజాన్ రివార్డ్‌లు, ఐసిఐసిఐ (ICICI) బ్యాంక్, అమెజాన్ పే (Amaozn Pay), ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్‌తో వినియోగదారులు రూ. 7,706 విలువైన బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చునని అందులో కనిపిస్తోంది. అమెజాన్ ఎక్స్చేంజ్ వాల్యూ ధర రూ. 20వేలు అని చూపిస్తోంది. కానీ, ఇది నిజం కాదని గమనించాలి. ఈ వాల్యూ ఎలాంటి గీతలు లేని పాత ఐఫోన్ వాల్యూ ఆధారంగా iPhone 13 ఆఫర్ రిజర్వ్ చేసి ఉండవచ్చు.

iPhone 14 under Rs 40K on Amazon_ Deal sounds great, but you shouldn't fall for it

Apple iPhone 14 Sale under Rs 40K on Amazon_ Deal sounds great

సేల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు :
ఆండ్రాయిడ్ ఫోన్‌ల రీసేల్ వాల్యూ ఆపిల్ ఇతర ఫోన్ల కన్నా చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ ధరను రూ. 39,293కి తగ్గించాయి. ఈ డీల్ చూసేందుకు గ్రేట్ డీల్ లాగా ఉంది. ఇంత తక్కువ ధరకు రావడం సాధ్యం పడదు. కస్టమర్‌లు ఆఫర్‌లతో ఐఫోన్ 14ను దాదాపు రూ. 63,000 వద్ద కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ సమయంలో ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయని కొనుగోలుదారులు గుర్తించాలి. అంతేకాదు.. స్టాక్‌లు కూడా పరిమితంగా ఉంటాయని గమనించాలి. ఐఫోన్ 14 కొనుగోలు చేసేందుకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వరకు వేచి ఉండకూడదనుకుంటే.. ఈ ఫోన్ ఇప్పటికే భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల్లో రూ. 71,999కి రిటైల్ అవుతుంది. ఇక వైట్ కలర్ ఆప్షన్ రూ.74,999కి అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కూడా క్రాస్ చెక్ చేయండి :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ల ధరను కూడా ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ ప్లాట్‌ఫారమ్ ఐఫోన్ 14ను రూ. 69,999 (రెడ్ కలర్)కు విక్రయిస్తోంది. అయినప్పటికీ, కస్టమర్‌లు రూ. 4వేల విలువైన HDFC బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు (Flipkart)లో ఏదైనా డివైజ్ ధరను ట్రాక్ చేసేందుకు ప్రైస్ ట్రాకర్ (Price Tracker) వంటి వెబ్ ఎక్స్‌టెన్షన్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీరు సెట్ చేసిన పాయింట్‌కి ధర తగ్గినప్పుడు వినియోగదారులు నోటిఫికేషన్‌ను పొందుతారు. మార్చి 2023లో iPhone 14 ధర రూ. 63,999కి పడిపోయిందని (Flipkart) చూపిస్తుంది. మీరు సరిగ్గా కొనుగోలు చేసినట్లయితే.. మీరు దాదాపు రూ. 59వేలు లేదా అంతకంటే తక్కువ ధరకు iPhone 14ని కొనుగోలు చేయవచ్చు. ఇతర స్టోరేజ్ వేరియంట్‌లు కూడా ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Human Jobs At Risk : మనుషులతో పనిలేదా? వచ్చే ఐదేళ్లలో ఏఐలదే ఆధిపత్యం.. ఆ జాబ్స్ చాట్‌బాట్‌లకే.. ఐబీఎం సీఈఓ ఏమన్నారంటే..?