iPhone 16e: ఫీచర్స్ అదుర్స్.. ఐఫోన్ 16ఈ కొంటారా? శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ కొంటారా? రెండింటికీ పోలికలు, తేడాలు ఇవిగో..
ఐఫోన్ 16ఈ, గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈను పోల్చుతున్నారు. వాటి డిజైన్, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్‌లో చాలా తేడాలు ఉన్నాయి.

ఆపిల్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 16ఈ ఫీచర్ల గురించి ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది. ఐఫోన్ 16ఈతో ఇతర ఫోన్లను పోల్చుతూ ఏది కొనాలా? అని ఆలోచిస్తున్నారు యూజర్లు. కొత్త ఫోను కొనాలనుకునేవారు ఐఫోన్ 16ఈతో ఇతర ఫోన్ల ఫీచర్లను పోల్చుతూ ఆ రెండింటి మధ్య ఉన్న తేడాలను గమనిస్తున్నారు.
ఐఫోన్ 16ఈ, గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈను పోల్చుతున్నారు. వాటి డిజైన్, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్‌లో చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా?
ఐఫోన్ 16ఈ ఫిబ్రవరి 19న మార్కెట్లలోకి వచ్చింది. అయితే, తక్కువ బడ్జెట్‌తో ఇది రాలేదు. ఈ ఐఫోన్ 16ఈకి చాలా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో పోటీ ఇస్తున్నాయి. వాటిలో ఒకటి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ కొంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ 6.7-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లేతో వచ్చింది. 1900 నిట్స్ మాగ్జిమం బ్రైట్‌నెస్‌తో, 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేటుతో విజువల్స్ ను అందిస్తుంది. శాంసంగ్ హుడ్‌తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ ఎక్సినోస్ 2400 ఈ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 8GB RAM, 128GB, 256GB, లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్లతో ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ స్మూత్ మల్టీ టాస్కింగ్‌తో వచ్చింది.
ఫొటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా సెటప్ బాగా నచ్చుతుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించే 8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇందులో 4700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇది 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ధరలు ఎలా ఉన్నాయి?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ (8GB RAM, 128GB) – గ్రాఫైట్ రూ.42,650
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ (8GB RAM, 256GB) – బ్లూ రూ.49,990
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ (8GB RAM, 256GB) – గ్రాఫైట్ రూ.50,440
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ (8GB RAM, 256GB) – మింట్ రూ.50,490
ఐఫోన్ 16ఈ కొంటే?
ఐఫోన్ 16ఈ 6.1-అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ ఉంటుంది
ప్రాసెసర్: 6-కోర్ సీపీయూ, 4-కోర్ జీపీయూతో ఏ18 చిప్
కెమెరా: ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటోతో 48ఎంపీ ఫ్యూజన్ వెనుక కెమెరా; 12ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ ట్రూడెప్త్ కెమెరా
బ్యాటరీ లైఫ్: 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
డిజైన్: గ్లాస్ ఫ్రంట్, మ్యాట్ బ్యాక్‌తో అల్యూమినియం ఫ్రేమ్; నలుపు, తెలుపు రంగులలో లభిస్తుంది
స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512 జీబీ
కనెక్టివిటీ: 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ సీ పోర్ట్
ఐఫోన్ 16ఈ: ధర, వేరియంట్లు
128GB: రూ. 59,900.
256GB: రూ. 69,900.
512GB: రూ. 89,900.