iPhone 17 Launch : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ భలే ఉందిగా.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కు ముందే దాదాపు అన్ని వివరాలు లీక్ అయ్యాయి. డిజైన్, కలర్ ఆప్షన్లు, కెమెరా, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iPhone 17 Launch : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ భలే ఉందిగా.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

iPhone 17 Launch

Updated On : April 27, 2025 / 6:24 PM IST

iPhone 17 Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్ అతి త్వరలో రిలీజ్ కానుంది. 2017 ఐఫోన్ X మాదిరిగా ఈ లైనప్ ఉంటుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో లాంచ్ అవుతుందని అంచనా.

ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే 4 మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముఖ్యంగా, నివేదికల ప్రకారం.. అమ్మకాల కారణంగా ఈ ఏడాదిలో ప్లస్ మోడల్ రద్దు చేసింది. రాబోయే ఈ కొత్త ఐఫోన్ 17 సిరీస్ గురించి మరిన్ని ఫీచర్లు, ధర, వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం…

Read Also : ATM Fees Hike : మే 1 నుంచి కొత్త రూల్స్.. ఏటీఎంలో డబ్బులు తీస్తే దబిడి దిబిడే.. లిమిట్ దాటితే ఛార్జీల మోతే..!

ఐఫోన్ 17 డిజైన్, డిస్‌ప్లే :
ఐఫోన్ 17 ఐఫోన్ 16 మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, కొన్ని మార్పులు ఉన్నాయి. బేస్ ఐఫోన్ 17 గత 6.1 అంగుళాల కన్నా కొంచెం పెద్ద 6.3-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండవచ్చు. పిల్-ఆకారపు బంప్ లోపల రెండు వర్టికల్ కెమెరా లేఅవుట్‌ ఉంటుంది.

ఐఫోన్ ప్రో వెర్షన్లలో మాత్రమే కాకుండా అన్ని ఐఫోన్ 17 మోడళ్లలో ప్రోమోషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 17 సూపర్-హార్డ్ యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను అందిస్తుంది. ప్రస్తుత సిరామిక్ షీల్డ్‌తో పోలిస్తే.. స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది.

ఐఫోన్ 17 కలర్ ఆప్షన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 అల్ట్రామెరైన్, టీల్ వంటి కలర్ ఆప్షన్లలో ఉండవచ్చు. అదే సమయంలో బ్లాక్, రోజ్, వైట్ ఆప్షన్లు కూడా ఉండొచ్చు.

ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు (అంచనా) :
హుడ్ కింద, ఐఫోన్ 17 A19 చిప్‌ను కలిగి ఉంటుంది. 3-నానోమీటర్ ప్రాసెస్‌పై వస్తుంది. బేసిక్ మోడల్ 8GB ర్యామ్ కలిగి ఉంది. ఆపిల్ సొంత 5G మోడెమ్‌ను లేనప్పటికీ మెరుగైన స్పీడ్, సామర్థ్యం కోసం Wi-Fi 7కి సపోర్టు ఇచ్చే కొత్త ఆపిల్ Wi-Fi చిప్‌ను కలిగి ఉంటుంది.

పర్ఫార్మెన్స్ కోసం అన్ని మోడళ్లలో కొత్త వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఛార్జింగ్ స్పీడ్ అలాగే ఉంటుంది. 35W వరకు వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఇంకా భారీ బ్యాటరీ మార్పులు లీక్ కాలేదు.

ఐఫోన్ 17 కెమెరా అప్‌‌గ్రేడ్స్ :
ఫ్రంట్ కెమెరాకు భారీ అప్‌గ్రేడ్ ఉంది. ఐఫోన్ 17 కొత్త 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. గత ఏడాదిలో 12MP రిజల్యూషన్‌తో పోలిస్తే.. రెట్టింపు రిజల్యూషన్‌ను కలిగి ఉంది. షార్ప్ సెల్ఫీలు, ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది. బ్యాక్ సైడ్ ఐఫోన్ 17 డ్యూయల్-లెన్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 48MP మెయిన్ వైడ్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది.

ఐఫోన్ 17 లాంచ్ తేదీ (అంచనా) :
ఆపిల్ సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13, 2025 మధ్య ఐఫోన్ 17 లైనప్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

Read Also : BSNL 5G SIM Delivery : BSNL కొత్త 5G సిమ్ కావాలా? కేవలం 90 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఎలా బుక్ చేయాలంటే?

భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ఐఫోన్ 17 ధర (అంచనా) :
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం విధించిన కొత్త సుంకాల కారణంగా ఐఫోన్ 17 సిరీస్ ధర స్వల్పంగా పెరగవచ్చు. భారత మార్కెట్లో సుమారు రూ. 89,900, అమెరికాలో 899 డాలర్లు, దుబాయ్‌లో AED 3,799 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.