iQOO 13 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ 13 ఫోన్ ఇదిగో.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!
iQOO 13 Launch : ఈ హ్యాండ్‌సెట్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.

iQOO 13 With Snapdragon 8 Elite SoC, 120W Fast Charging Launched
iQOO 13 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ 13 వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీతో 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. కంపెనీ ఇంటర్నల్ క్యూ2 గేమింగ్ చిప్‌ను కూడా ఫోన్‌లో అందిస్తుంది. పైన ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 5 స్కిన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.
ఐక్యూ 13 ధర, లభ్యత :
చైనాలో ఐక్యూ 13 ఫోన్ 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర సీఎన్‌వై 3,999 (సుమారు రూ. 47,200) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,499 (సుమారు రూ. 53,100)కు పొందవచ్చు. 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లతో కూడిన 16జీబీ ర్యామ్ వెర్షన్‌లు వరుసగా సీఎన్‌వై 4,299 (సుమారు రూ. 50,800), సీఎన్‌వై 4,699 (దాదాపు రూ. 55,500), సీఎన్‌వై 5,199 (సుమారు రూ. 61) వద్ద జాబితా అయింది. ఈ ఐక్యూ ఫోన్ వివో చైనా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఐల్ ఆఫ్ మ్యాన్, లెజెండరీ ఎడిషన్, నార్డో గ్రే, ట్రాక్ ఎడిషన్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఐక్యూ 13 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఐక్యూ 13 ఫోన్ 6.82-అంగుళాల 2కె (1,440 x 3,168 పిక్సెల్‌లు) బీఓఈ క్యూ10 8టీ ఎల్‌టీపీఓ 2.0 ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 144Hz వరకు రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టీబీ యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ క్యూ2 గేమింగ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 5 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఐక్యూ 13 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, టెలిఫోటో లెన్స్‌తో 50ఎంపీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. ఓఐఎస్ సపోర్టుతో బ్యాక్ కెమెరా మాడ్యూల్ 6 డైనమిక్ ఎఫెక్ట్‌లు, 12 కలర్ కాంబినేషన్‌లకు సపోర్టుతో కస్టమైజడ్ “ఎనర్జీ హాలో” ఎల్ఈడీ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ కెమెరా 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఐక్యూ 13 120డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,150mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఐక్యూ 13 ఐల్ ఆఫ్ మ్యాన్, లెజెండరీ ఎడిషన్, నార్డో గ్రే వేరియంట్‌లు 163.37 x 76.71 x 8.13ఎమ్ఎమ్ సైజు, 213గ్రాముల బరువును కలిగి ఉంటాయి. అయితే, ట్రాక్ ఎడిషన్ 7.99ఎమ్ఎమ్ మందం, బరువు 207గ్రాములు ఉంటుంది.
Read Also : Nokia 4G Series Launch : వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియోతో నోకియా రెండు కొత్త 4జీ ఫోన్లు.. స్నేక్ గేమ్ కూడా..!