Aadhaar Card : మీకు తెలియకుండా ఎవరైనా మీ ఆధార్‌ని ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్ చేయాలంటే?
Aadhaar Card : ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సౌకర్యాలు, టెలికాం కనెక్షన్‌లను యాక్సెస్ చేసేందుకు ఈ 12 అంకెల ప్రత్యేక ఐడీ చాలా ముఖ్యమైనది. ఈ ఆధార్ కార్డ్ ఇప్పుడు జాగ్రత్తగా వినియోగించకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

Aadhaar without your knowledge
Aadhaar Card : భారతీయ నివాసితులకు ఆధార్ కార్డు ప్రాథమిక గుర్తింపుకార్డుగా మారింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సౌకర్యాలు, టెలికాం కనెక్షన్‌లను యాక్సెస్ చేసేందుకు ఈ 12 అంకెల ప్రత్యేక ఐడీ చాలా ముఖ్యమైనది. ఈ ఆధార్ కార్డ్ ఇప్పుడు జాగ్రత్తగా వినియోగించకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
డేటా ఇంటిగ్రేషన్ కారణంగా మోసగాళ్ళు ఆర్థిక మోసం లేదా సేవలకు అనధికారిక యాక్సెస్ చేసే ప్రమాదం ఉంటుంది. దొంగిలించిన ఆధార్ వివరాలతో నేరాలకు పాల్పడిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఒకవేళ దోపిడీకి గురైతే బాధితులు తమ పేరుతో నిర్వహించే కార్యకలాపాల కారణంగా సర్వీసులు బ్లాక్ కావడం లేదా ఆర్థిక నష్టం లేదా చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు.
మీ ఆధార్ దుర్వినియోగం అవుతుందో లేదో మీరు ఎలా చెక్ చేయవచ్చు? మీరు నేరుగా చెక్ చేయలేనప్పటికీ, ప్రయాణం, బసలు, బ్యాంకింగ్, ఇతర ప్రయోజనాల కోసం గతంలో మీ ఆధార్ నంబర్ ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఆధార్‌ను సురక్షితంగా ఉంచడమే కాకుండా వినియోగాన్ని ట్రాక్ చేయడంలో సాయపడేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వినియోగదారులు వారి ఆధార్ వినియోగాన్ని పర్యవేక్షించవచ్చు. మీ ఆధార్ నంబర్ వినియోగాన్ని పర్యవేక్షించడంలో మీకు సాయపడే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
1. myAadhaar పోర్టల్‌కి వెళ్లండి.
2. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ చేసి క్లిక్ చేయండి.
3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపుతారు. మీ అకౌంట్ యాక్సెస్ చేసేందుకు రిజిస్టర్ చేయండి.
4. “Authentication History” ఆప్షన్ ఎంచుకుని మీరు రివ్యూ చేయాలనుకునే వ్యవధి కోసం తేదీ పరిధిని ఎంచుకోండి.
5. లాగ్‌ని చెక్ చేయండి. ఏదైనా తెలియని లేదా అనుమానాస్పద లావాదేవీలను చెక్ చేయండి.
మీరు అనధికార యాక్సస్ గుర్తించినట్లయితే వెంటనే దానిని (UIDAI)కి రిపోర్టు చేయండి.
మీరు వీటిని చేయవచ్చు :
- UIDAI టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1947కు కాల్ చేయండి
- మీ రిపోర్టు రాసి help@uidai.gov.in ఇమెయిల్‌కు పంపండి.
- అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- “లాక్/అన్‌లాక్ ఆధార్” సెక్షన్ నావిగేట్ చేయండి.
- మార్గదర్శకాలను చదవండి. పేజీలో అందించిన సూచనలను రివ్యూ చేయండి.
- అవసరమైన సమాచారాన్ని అందించండి. మీ వర్చువల్ ID (VID), పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను పొందడానికి “Send OTP” క్లిక్ చేయండి.
- మీ బయోమెట్రిక్‌లను సేవ్ చేసుకోండి : ప్రక్రియను పూర్తి చేసేందుకు మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేసే ఓటీపీని ఉపయోగించండి.
Read Also : Apple iPhone 16 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?