Reliance Jio Offer : జియో ప్రీపెయిడ్ ప్లాన్ రీఎంట్రీ.. హైస్పీడ్ డేటా ఎంతంటే?

ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది.

Reliance Jio Offer : జియో ప్రీపెయిడ్ ప్లాన్ రీఎంట్రీ.. హైస్పీడ్ డేటా ఎంతంటే?

Jio Reintroduces Rs 98 Prepaid Recharge Plan With 1 5gb Daily High Speed Data For 14 Days

Updated On : May 31, 2021 / 7:28 PM IST

Reliance Jio Plan : ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ప్లాన్ ఆపేసిన తర్వాత మళ్లీ జియో యూజర్ల కోసం అదే ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది.

గతంలో 28 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ఇప్పుడు 14 రోజులకు తగ్గించింది. రీచార్జ్ ప్లాన్‌లో మాత్రం అదనంగా బెనిఫెట్స్ అందించింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద హైస్పీడ్ డేటా రోజుకు 1.5GBతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫెట్స్ అందిస్తోంది.

అలాగే జియో యాప్స్ కింద జియోటీవీ, జియో సినిమా, జియోన్యూస్ అందిస్తోంది. జియో రీలాంచ్ చేసే రీఛార్జ్ ప్లాన్లలో రూ.129, రూ.98 ప్లాన్లను తగ్గించి రీఎంట్రీ ఇచ్చింది. 2020 ఏడాది మే నెలలో రూ.98 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేసింది.

జియో.కామ్ లేదా మైజీయో యాప్ ద్వారా యూజర్లు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. గూగుల్ పే, పేటీఎం ద్వారా యూజర్లు ఈ కొత్త బెనిఫెట్స్ పొందవచ్చు.