JioHotstar Subscription : వావ్.. వండర్‌ఫుల్ ప్లాన్.. కేవలం రూ.100కే జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
JioHotstar Subscription : జియో యూజర్ల కోసం అదిరే ప్లాన్.. కేవలం రూ. 100కే జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. ఒక నెల కాదు.. ఏకంగా 3 నెలల పాటు ఓటీటీ కంటెంట్ యాక్సస్ చేయొచ్చు.

Reliance Jio
JioHotstar Subscription Plan : జియో యూజర్లకు పండగే.. జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ కేవలం రూ. 100కే ఆఫర్ చేస్తోంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏకంగా 3 నెలలు (90 రోజులు) ఓటీటీ కంటెంట్ యాక్సస్ చేయొచ్చు. ఇటీవలే ముఖేష్ అంబానీ కంపెనీ జియో హాట్‌స్టార్‌ను విలీనం చేసి జియో హాట్‌స్టార్‌గా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
గతంలో ఐపీఎల్ ఐపీఎల్‌ను ఉచితంగా అందించేది. కొన్ని రోజుల్లో ఐపీఎల్ మళ్ళీ రాబోతుంది. కానీ, ఈసారి ఐపీఎల్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ప్లాన్‌లు రూ. 149 నుంచి ప్రారంభమై ప్రీమియం రూ. 499 వరకు ఉంటుంది.
కానీ, జియో సిమ్ యూజర్లకు మాత్రమే చౌకైన ప్లాన్‌ను కూడా అందిస్తోంది. కేవలం రూ. 100కే ఆఫర్ చేస్తోంది. ఇంతకీ, ఈ ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జియో రూ. 100 ఫుల్ ప్లాన్ ఇదిగో :
జియో ఇటీవలే ‘జియో-డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.100కే అందుబాటులో ఉంది. మొబైల్‌లో ఓటీటీ కంటెంట్‌ను చౌకైన ధరకే అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 3 నెలలు (90 రోజులు) ఉంటుంది.
మొబైల్ డివైజ్‌లు+ టీవీలో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. అన్ని హాట్‌స్టార్ షోలు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ (ఐపీఎల్, క్రికెట్ సిరీస్ ) కంటెంట్ యాక్సస్ చేయొచ్చు. మీరు కేవలం రూ. 100కు హాట్‌స్టార్ బెస్ట్ బెనిఫిట్స్ 3 నెలలు పొందవచ్చు.
ఈ స్కీమ్ స్పెషాలిటీ ఏంటి? :
రూ. 100కు 3 నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్‌ను యాక్సస్ చేయొచ్చు. ఐపీఎల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. దాదాపు 3 నెలల పాటు కొనసాగుతుంది. ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. క్రికెట్ ప్రియులకు సరైనది కూడా.
ఈ ప్లాన్‌లో మీరు జియోహాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, 5GB అదనపు ఇంటర్నెట్ డేటా ప్యాక్ పొందుతారు. కాలింగ్, మెసేజింగ్ ఫెసిలిటీ అందుబాటులో లేదు. ఈ సౌకర్యం జియో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
రూ. 100 హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఎలా పొందాలి? :
1. MyJio యాప్ ఓపెన్ చేయండి.
2. ‘Hotstar Subscription’ సెక్షన్‌కు వెళ్లండి
3. రూ. 100 ప్లాన్ ఎంచుకోండి
4. పేమెంట్ చేసి తక్షణమే యాక్టివేట్ చేయండి.
5. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జియో నంబర్‌తో లాగిన్ అవ్వండి.