iQOO 13 5G Price : ఆఫర్ అదిరింది భయ్యా.. ఐక్యూ 13 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు!
iQOO 13 5G Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఐక్యూ 13 5జీపై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఐక్యూ 5జీ ఫోన్ ఇంకా తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

iQOO 13 5G Price
iQOO 13 5G Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్, ఆపిల్ వంటి బ్రాండ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ విభాగంలో ఈ బ్రాండ్ల ఫోన్లకు తిరుగులేదు. ఈ బ్రాండ్లకు పోటీగా ఐక్యూ హై పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్‌ఫోన్‌లతో సంచలనం సృష్టిస్తోంది.
పోటీ ధరలకు తగినట్టుగా టాప్ రేంజ్ ఫీచర్లను అందిస్తోంది. ఐక్యూ 13 5G పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే కెమెరా సెటప్‌ను కలిగిన ప్రీమియం ఫోన్. మీరు తక్కువ ఖర్చులో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్‌లో ఐక్యూ 13 5G ఫోన్ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ 5జీ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి.
ఐక్యూ 13 5జీపై భారీ డిస్కౌంట్ :
ఐక్యూ 13 5G (256GB వేరియంట్) ఫోన్ ధర అమెజాన్ ఇండియాలో రూ.61,999గా ఉంది. అయితే, 11 శాతం తగ్గింపుతో కొత్త ధర రూ.54,998కు అందిస్తోంది. కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ కొనేందుకు చూస్తున్న వారికి అమెజాన్ నెలకు రూ.4,316 నుంచి ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది.
అమెజాన్ కూడా ఎక్స్ఛేంజ్ డీల్‌ను అందిస్తోంది. తద్వారా కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా రూ.22,800 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు గరిష్ట ఎక్స్ఛేంజ్ ద్వారా ఐక్యూ 13 5G ధర కేవలం రూ.32,198కి తగ్గుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్లాగ్‌షిప్ డీల్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.
ఐక్యూ 13 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ప్రీమియం డిజైన్ :
ఐక్యూ 13 5జీ గ్లాస్ బ్యాక్, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో వస్తుంది ప్రీమియం లుక్ ఇస్తుంది. IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. దుమ్ము పడినా లేదా నీటిలో తడిసినా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఆకర్షణీయమైన డిస్‌ప్లే :
6.82-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. మృదువైన విజువల్స్, మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
హై పర్ఫార్మెన్స్ చిప్‌సెట్ :
ఐక్యూ 13 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 16GB ర్యామ్ వరకు 1TB స్టోరేజీ వరకు కలిగి ఉంది. ఇక యాప్‌లు, గేమ్‌లు, మీడియా ఫైల్‌లకు తగినంత స్టోరేజీని అందిస్తుంది.
ప్రో-గ్రేడ్ కెమెరా సెటప్ :
రియర్ కెమెరా సెటప్‌లో 3 50ఎంపీ సెన్సార్లు ఉన్నాయి. హై క్వాలిటీ ఫొటోగ్రఫీ, అల్ట్రా-వైడ్ షాట్లు, ఆకర్షణీయమైన జూమ్ ఆప్షన్లను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసేందుకు 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
లాంగ్ టైమ్ బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ :
భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. పదేపదే ఛార్జింగ్ అవసరం లేకుండా రోజంతా ఛార్జ్ వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఐక్యూ 13 5G కొనాలా? వద్దా? :
ఐక్యూ 5జీ ఫోన్ అద్భుతమైన ఫోన్. ప్రస్తుత అమెజాన్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనేవారికి ఆకర్షణీయమైన డీల్ అని చెప్పవచ్చు.