Jio Prepaid Plan : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. మీ బడ్జెట్‌లో కేవలం రూ. 189కే రీఛార్జ్.. బెనిఫిట్స్ ఇవే..!

Jio Prepaid Plan : ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించాలి. జియో కనీసం 2జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లతో మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీని అందిస్తుంది.

Jio Prepaid Plan : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. మీ బడ్జెట్‌లో కేవలం రూ. 189కే రీఛార్జ్.. బెనిఫిట్స్ ఇవే..!

Jio Rs 189 prepaid plan

Updated On : September 26, 2024 / 5:58 PM IST

Jio Prepaid Plan : రిలయన్స్ జియో యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఈ జియో సిమ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులు తమ జియో సిమ్ కార్డ్‌ని సెకండరీ ఆప్షన్‌గా ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడు ఫోన్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ కోసం యాక్టివ్‌గా ఉంచాలనుకునే జియో యూజర్లు రూ. 189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్-ఫ్రెండ్లీ పరిష్కారాన్ని అందిస్తుంది.

Read Also : Amazon Festival Sale : అమెజాన్ ప్రైమ్ సేల్ మొదలైందోచ్.. ఈ ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కుద ధరకే పొందాలంటే?

డేటా ప్లాన్ బెనిఫిట్స్ :
వ్యాలిడిటీ : 28 రోజులు
వాయిస్ కాల్స్: అన్‌లిమిటెడ్ కాల్స్
డేటా : 2జీబీ (ఎఫ్‌యూపీ తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్ తగ్గింపు)
ఎస్ఎంఎస్ : 300 అవుట్‌గోయింగ్ మెసేజ్‌లు

అదనపు బెనిఫిట్స్ :
జియోసినిమా, జియోక్లౌడ్, జియోటీవీ ప్రైమరీ మెంబర్‌షిప్ ఆప్షన్లుగా పొందవచ్చు.

కాలింగ్ యూజర్లకు బెస్ట్ ప్లాన్ :
కాలింగ్ బెనిఫిట్స్ ప్రాధాన్యతనిచ్చే లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్ అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. గత సంవత్సరాల కన్నా ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, భారత్‌లో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో అత్యంత సరసమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది.

అన్‌లిమిటెడ్ 5జీ డేటా లేదు :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించడం ముఖ్యం. జియో కనీసం 2జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లతో మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీని అందిస్తుంది.

రీఛార్జ్ ఎంతంటే? :
జియో రీఛార్జ్ రూ. 189 ప్లాన్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. వివిధ ఛానెల్‌ల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. మైజియో యాప్ లేదా జియో.కామ్ ద్వారా రీఛార్జ్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు :
రిలయన్స్ జియో రూ. 189 ప్లాన్ ద్వారా మీ జియో సిమ్‌ను తక్కువ ఖర్చుతో వినియోగించవచ్చు. జియో వినియోగదారులకు ప్రధానంగా కాల్ బెనిఫిట్స్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!