Lava Agni 2S India Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో లావా అగ్ని 2ఎస్ ఫోన్ వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!
Lava Agni 2S India Launch : భారత మార్కెట్లో లావా అగ్ని 2ఎస్ ఫోన్ లాంచ్ కానుంది. గత లావా అగ్ని 2 మాదిరిగానే స్పెషిఫికేషన్లు ఉంటాయని భావిస్తున్నారు.

Lava Agni 2S India Launch Tipped in November
Lava Agni 2S India Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నవంబర్ చివరిలో లావా అగ్ని 2ఎస్ కొత్త మోడల్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో మేలో లావా అగ్ని 2 5జీ రిలీజ్ చేయగా.. మీడియాటెక్ డైమెన్షిటీ 7050 ఎస్ఓసీ, 66డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. కర్వ్డ్ అమోల్డ్ 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 50ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. నవంబర్ 2021లో లాంచ్ అయిన లావా అగ్ని 5జీని అగ్ని 2కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.
కంపెనీ కొత్త అగ్ని 2ఎస్ మోడల్‌ను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు టిప్‌స్టర్ పేర్కొంది. నివేదిక ప్రకారం.. లావా అగ్ని 2S భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌లో లావా అగ్ని 2 మాదిరిగానే స్పెసిఫికేషన్‌లు ఉన్నాయని సూచిస్తోంది. అయితే, వేరే చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. హ్యాండ్‌సెట్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలియదు. అయితే, లాంచ్ తేదీ సమయంలో మిగతా ఫీచర్ల వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
లావా అగ్ని 2 5జీ ఫోన్ భారత్ ధర రూ.19,999 ఉండగా.. హీథర్, ఐరన్, విరిడియన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. సింగిల్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పైభాగంలో పెద్ద వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది.
లావా అగ్ని 2ఎస్ ఫోన్ కీలక స్పెషిఫికేషన్లు ఇవే :
6.78-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (2220×1080 పిక్సెల్‌లు) కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో, లావా అగ్ని 2 5జీ 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, ఎర్గోనామిక్ 3డీ డ్యూయల్-కర్వ్డ్ ప్యానెల్, హెచ్‌డీఆర్ ప్లస్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. వాస్తవంగా 16జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పాటు స్టాక్ ఆండ్రాయిడ్ 13తో వస్తుంది.

Lava Agni 2S India Launch
లావా అగ్ని 2 5జీ క్వాడ్ రియర్ కెమెరా యూనిట్ 50ఎంపీ 1.0-మైక్రాన్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్, మరో 2ఎంపీ మాక్రో షూటర్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌లో ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. లావా అగ్ని 2 5జీ ఫోన్ 4,700ఎంఎహెచ్ బ్యాటరీని 66డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్‌ను 16 నిమిషాలలోపు జీరో నుంచి 50శాతం వరకు ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఈ ఫోన్ భద్రతకు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డ్యూయల్ సిమ్-సపోర్టు ఉన్న హ్యాండ్‌సెట్ 5జీ, వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్-సి, జీపీఎస్, బీడౌ, గెలీలియో, గ్లోనాస్ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. 210 గ్రాముల బరువు, 164.15ఎమ్ఎమ్x74.7ఎమ్ఎమ్x 8.75ఎమ్ఎమ్ పరిమాణంలో ఉంటుంది.