Aadhaar PAN Link : మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar PAN Link : ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయలేదా? వెంటనే ఈ పని పూర్తి చేయండి లేదంటే ఇబ్బందులు తప్పవు..

Aadhaar PAN Link : మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar PAN Link

Updated On : July 8, 2025 / 6:09 PM IST

Aadhaar PAN Link : మీ పాన్ కార్డు ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకున్నారా? లేదంటే వెంటనే లింక్ చేసుకోండి. కొత్త పాన్ కార్డ్ తీసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను (Aadhaar PAN Link) తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ జూలై 1, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త పాన్ కార్డ్ పొందాలనుకుంటే.. మీ ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు పాన్ దరఖాస్తులకు ఆధార్ నంబర్ అవసరం లేదు. గుర్తింపు కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నుంచి మాత్రమే పాన్ కార్డ్ పొందేవారు. కానీ ఇప్పుడు మీరు కొత్త పాన్ పొందాలనుకుంటే.. మొదట మీరు మీ ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు ఆధార్‌ను OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి. అప్పుడే మీకు పాన్ కార్డు జారీ అవుతుంది. ఈ ప్రక్రియ ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

Read Also : Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025.. శాంసంగ్ నుంచి వన్‌‌ప్లస్ ఫోన్ల వరకు టాప్ 5 డీల్స్ మీకోసం..!

పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి? :

  • ముందుగా, మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ (IncomeTax Website) విజిట్ చేయాలి.
  • హోమ్‌పేజీలో ‘Link Aadhaar’ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేయాలి.
  • పాన్‌ను ఆధార్‌తో లింక్ ప్రక్రియ పూర్తి అయినట్టే.
  • డేటా మొత్తం సరిగ్గా ఉంటే మీ పాన్ ఆధార్‌తో లింక్ అవుతుంది.

ఆఫ్‌లైన్ ప్రక్రియ :
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకొని మీ సమీపంలోని పాన్ సర్వీసు సెంటర్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఆఫీసుకు వెళ్లండి. మీరు పాన్ కార్డు, ఆధార్ సెల్ఫ్ వెరిఫైడ్ కాపీలు, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఫారమ్‌ను సమర్పించిన తర్వాత మీకు రసీదు ఇస్తారు. ఈ రసీదు ద్వారా పాన్ కార్డు స్టేటస్ సులభంగా ట్రాక్ చేయవచ్చు.

కచ్చితంగా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు కాపీని తీసుకోండి. పాన్ కార్డు, ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ అని ఒకేలా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. లేకుంటే ముందుగా వాటిని సరిదిద్దుకోండి. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.