కొత్త కారు కొంటున్నారా? ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు.. వెంటనే కొనేసుకోండి!
Maruti Suzuki Prices hike : వచ్చే ఫిబ్రవరి నుంచి వివిధ మోడళ్లలో కార్ల మోడల్ బట్టి రూ. 32,500 వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

Maruti Suzuki Car Prices
Maruti Suzuki Prices hike : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ భారతీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ త్వరలో కార్ల ధరలను పెంచాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి మారుతీ కార్ల ధరలు పెరగనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేసేందుకు వచ్చే ఫిబ్రవరి నుంచి వివిధ మోడళ్లలో కార్ల మోడల్ బట్టి రూ. 32,500 వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
Read Also : Aadhaar Safe Tips : మీ ఆధార్ సురక్షితమేనా? మీ ఆధార్ నంబర్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో ఇలా చెక్ చేయండి!
స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మాట్లాడుతూయయ పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచాలని మారుతి సుజుకీ యోచిస్తోంది. “కంపెనీ ఖర్చులను సర్దుబాటు చేయడంతో పాటు వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించేందుకు పెరిగిన ఖర్చులలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయనున్నట్టు” కంపెనీ పేర్కొంది. సుజుకి సవరించిన ధరల ప్రకారం.. కాంపాక్ట్ కారు, సెలెరియో, ఎక్స్-షోరూమ్ ధరలలో రూ. 32,500 వరకు ప్రీమియం మోడల్ ఇన్విక్టా రూ. 30వేల వరకు పెరుగుతుంది.
మారుతి సుజుకి ఇండియా పాపులర్ వ్యాగన్-ఆర్ మోడల్ ధర రూ. 15వేల వరకు పెరుగుతుంది. స్విఫ్ట్ ధర రూ. 5వేల వరకు పెరుగుతుంది. ఎస్‌యూవీలలో బ్రెజ్జా, గ్రాండ్ విటారా వరుసగా రూ. 20వేలు, రూ. 25వేల వరకు ధరలను పెంచుతాయి. ఎంట్రీ లెవల్ చిన్న కార్లలో అల్టో కె10 ధరలు రూ. 19,500 వరకు, ఎస్-ప్రెస్సో ధర రూ. 5వేల వరకు పెరుగుతాయి.
ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బాలెనో ధర రూ. 9వేల వరకు, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ధర రూ. 5,500 వరకు, కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ధర రూ. 10వేల వరకు పెరుగుతుందని కార్ల తయారీదారు వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ఆల్టో కె-10 నుంచి రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఇన్విక్టో వరకు రూ. 28.92 లక్షలకు అనేక రకాల కార్ల మోడళ్లను విక్రయిస్తోంది.
మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధర పెంపు :
సెలెరియోకి రూ. 32,500 ధర పెరిగింది. అయితే, సియాజ్, జిమ్నీ ధరలు రూ. 1,500 వరకు పెరుగుతాయి. ఈ మోడల్ వారీగా ధరలు ఇలా ఉన్నాయి.
- ఆల్టో K10: రూ. 19,500 వరకు
- ఎస్-ప్రెస్సో: రూ. 5వేల వరకు
- సెలెరియో: రూ. 32,500 వరకు
- వ్యాగన్ ఆర్ : రూ. 13వేల వరకు
- స్విఫ్ట్ : రూ. 5వేల వరకు
- డిజైర్ : రూ. 10,500 వరకు
- బ్రెజ్జా : రూ. 20వేల వరకు
- ఎర్టిగా : రూ. 15వేల వరకు
- ఈకో : రూ. 12వేల వరకు
- సూపర్ క్యారీ : రూ. 10వేల వరకు
- ఇగ్నిస్ : రూ. 6వేల వరకు
- బాలెనో : రూ. 9వేల వరకు
- సియాజ్ : రూ. 1,500 వరకు
- ఎక్స్ఎల్6 : రూ. 10వేల వరకు
- ఫ్రాంక్స్ : రూ. 5,500 వరకు
- ఇన్విక్టో : రూ. 30వేల వరకు
- జిమ్నీ : రూ. 1,500 వరకు
- గ్రాండ్ విటారా : రూ. 25వేల వరకు