Money Rules Dec 1 : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఎల్‌పీజీ నుంచి క్రెడిట్ కార్డు, ఐటీఆర్, ఆధార్ అప్‌డేట్ డెడ్‌లైన్ వరకు.. ఫుల్ డిటైల్స్ మీకోసం..!
Money Rules from Dec 1 : డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్ లేదా ఆధార్ ఐడీ అప్‌డేట్ చేసేవారు ఈ నెలలో ఆర్థిక విషయాల్లో కీలక మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.

Money Rules from Dec 1 : కొత్త నెల ప్రారంభమైంది. 2024 ఏడాది 31 రోజుల్లో ముగియబోతోంది. డిసెంబర్, 2024లోనూ పలు ఆర్థిక అంశాలకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొన్ని ఆర్థిక విషయాలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రధానంగా ఎల్‌పీజీ గ్యాస్ ధరల దగ్గర నుంచి క్రెడిట్ కార్డులు, ఐటీఆర్ ఫైలింగ్, ఆధార్ ఐడీ అప్‌డేట్ వరకు అనేక ఆర్థిక పరమైన అంశాలు ఉంటాయి. ఈ కొత్త నిబంధనల కారణంగా వినియోగదారులపై అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 1, 2024 నుంచి ఏయే అంశాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్‌పీజీ ధరలు :
చమురు మార్కెటింగ్ కంపెనీలు నెలవారీ ప్రాతిపదికన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సర్దుబాటు చేయవచ్చు. ఫలితంగా దేశీయ ఎల్‌పీజీ ధరలను ప్రభావితం చేయవచ్చు. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, విధానాల ద్వారా ప్రభావితమవుతాయి. ముఖ్యంగా గృహపరమైన ఆర్థిక అవసరాలపై ప్రభావం పడుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలపై సమీక్ష నిర్వహిస్తుంటారు. ఈ సమీక్షలో ధరల పెంపుతో పాటు తగ్గింపు కూడా ఉంటుంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కొద్దికాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు నెలలుగా 19కేజీలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 2024 డిసెంబర్‌లో కూడా గ్యాస్ ధరలు పెరగనున్నాయి. తద్వారా గ్యాస్ వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది.
ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ :
ఆధార్ వివరాలకు ఉచిత అప్‌డేట్‌ల గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. ఆధార్ కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, ఇంటి అడ్రస్ లేదా పుట్టిన తేదీని అప్‌డేట్ చేయవచ్చు. దయచేసి ఈ తేదీ తర్వాత చేసిన అప్‌డేట్‌లకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని గుర్తుంచుకోండి.
ఐటీఆర్ దాఖలకు గడువు తేదీ :
జూలై 31 గడువులోగా 2023-24 (FY24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు తేదీ తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయని పన్నుదారులపై భారం పడనుంది. ఇప్పటికీ డిసెంబర్‌లోగా తమ ఐటీఆర్ సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. దీనికి రూ. 5వేలు ఆలస్య రుసుము వర్తిస్తుందని గమనించాలి. మొత్తం రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ ఆలస్య రుసుము రూ. వెయ్యికి తగ్గింది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల నిబంధనలు ..
డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారం లేదా బిజినెస్ కోసం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం.. డిసెంబర్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ లేదా మర్చంట్ లావాదేవీలపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు పొందలేరని గమనించాలి.
ట్రాయ్ గడువు :
డిసెంబర్ 1, 2024న, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్, ఫిషింగ్ మెసేజింగ్ తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్‌బిలిటీ నిబంధనలను అమల్లోకి తీసుకువస్తోంది. ఈ నిబంధనలు ఓటీపీ సర్వీసులకు తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది. “ట్రాయ్ మెసేజ్ ట్రేసిబిలిటీ మాండేట్ కారణంగా మెసేజ్‌లు, ఓటీపీల డెలివరీలు ఆలస్యం కావని ట్రాయ్ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో పేర్కొంది.
Read Also : TRAI OTP Delay : డిసెంబర్ 1 నుంచి ఆధార్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఓటీపీ ఆలస్యం కానుందా? ట్రాయ్ క్లారిటీ!