మీ స్మార్ట్‌ఫోన్‌ను భద్రంగా Lock చేయండిలా? ఏది బెస్ట్ అంటే?

ఇప్పుడు ప్రతిఒక్కరి అరచేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.. ప్రతీది స్మార్ట్ ఫోన్‌లో సేవ్ చేసేస్తుంటారు. ఫోన్‌లోని పర్సనల్ డేటాను ఎవరూ చూడకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు సాధారణంగా ఫోన్ లాక్ చేస్తుంటారు.. ఇందుకు కొన్ని సెక్యూర్ సెట్టింగ్స్ వాడుతుంటారు.. ఫోన్లో పర్సనల్ డేటా ఫొటోలు లేదా వీడియోలు, ఇతర కాంటాక్టుల విషయంలో కాస్తా జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు..
సైబర్ నేరగాళ్లు, హ్యాకర్ల చేతికి పర్సనల్ డేటా చిక్కకుండా సురక్షితంగా ఉండాలంటే తప్పనిసరిగా ఫోన్ లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.. ఇప్పుడు వచ్చే ప్రతి స్మార్ట్ ఫోన్‌లో లాకింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో మూడింట ఒక వంతు మంది తమ ఫోన్లను సెక్యూర్ కోసం సింపుల్ 4-అంకెల పాస్‌కోడ్‌ను మాత్రమే వాడటం లేదు. ప్రస్తుతం, ఫోన్‌లను లాక్ లేదా అన్‌లాక్ చేసేందుకు భద్రతపరంగా అనేక మార్గాలు ఉన్నాయి.. అందులో face scans, thumbprints, irises, passcodes, patterns
వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. వీటిలో ఏ ఫోన్ లాక్ సురక్షితమో తెలుసుకుందాం..
passcodes :
పాస్‌కోడ్‌లు అనేవి సింపుల్ సెక్యూర్ స్మార్ట్‌ఫోన్ లాకింగ్ సిస్టమ్.. స్టాండర్డ్ 4-అంకెల కోడ్ నుంచి కాంప్లెక్స్ మల్టీ క్యారేక్టర్ పాస్‌వర్డ్‌ల వరకు వినియోగించు కోవచ్చు.. ఎల్లప్పుడూ ఈ పాస్ కోడ్ లను ఫోన్ లాక్ గా సెట్ చేసుకోవచ్చు.. సింపుల్ 4-అంకెల పిన్‌ను సెట్ చేసుకోవచ్చు.. 37-క్యారెక్టర్ ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్ కంటే హ్యాక్ చేయడం కష్టం.. కానీ మీ ఫోన్‌ను Passcodeతో వేగంగా అన్‌లాక్ చేయవచ్చు. పాస్‌కోడ్‌లను ఎప్పుడూ కొంచెం ఎక్కువ క్యారెక్టర్లు ఉండేటా పాస్ వర్డ్ చేసుకోవాలి. ఇతరులు ఎవరూ గుర్తించకుండా సెక్యూర్ గా ఉంచుకోవచ్చు.
చాలా మంది iOS యూజర్లకు లాంగ్ న్యూమరిక్ PIN క్రియేట్ చేయడం తెలియదు. పాస్‌వర్డ్ సెట్ చేయడానికి ఫోన్ లెటర్స్ కీబోర్డ్ నుంచి న్యూమరిక్ కీబోర్డుకు మారండి.. ఇక్కడే మీ Passcode ఎంటర్ చేయండి. 5 లేదా 6 అంకెల PIN, 4-అంకెల కోడ్ కంటే ఎంతో సురక్షితంగా ఉంటుంది. 123456 పాస్ వర్డ్ గా అసలు పెట్టుకోవద్దు.. లాక్ స్క్రీన్ తీసేటప్పుడు మీ పాస్‌కోడ్ కోసం న్యూమరిక్ కీప్యాడ్ డిస్ ప్లే అవుతుంది. సెక్యూర్ కోసం లెటర్స్, న్యూమరిక్, ఐకాన్లతో కూడిన పాస్‌వర్డ్ సెట్ చేసకోవాలి.. కనీసం ఎనిమిది క్యారెక్టర్ల పాస్ వర్డ్ పెట్టుకోవడం ఎంతో ఉత్తమం..
Pattern unlock :
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్ సెక్యూర్ ఉంచుకోవాలంటే PIN code లేదా పాస్‌వర్డ్‌కు బదులుగా Pattern Unlock సిస్టమ్‌ను వాడొచ్చు.. ఇది మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి డాట్ గ్రిడ్‌లో కనిపిస్తుంది.. మీకు ఎలా కావాలంటే అలా డాట్ గ్రిడ్ డిజైన్ ఎంచుకోవచ్చు.. మీ ఫోన్ స్ర్కీన్‌పై కనిపించే ప్యాటర్న్ డాట్లను వేలితో కలుపుతూ సెట్ చేసుకోండి..
ఒకసారి సెట్ చేస్తే చాలు.. మీ ఫోన్ అన్ లాక్ చేసేటప్పుడు ముందుగా ఎలా ప్యాటర్న్ ఎంచుకున్నారో అలానే వేలితో డాట్లను కలపాలి.. అంతే… మీ ఫోన అన్ లాక్ అయిపోతుంది.. కానీ, ఈ అన్‌లాక్ అంత సురక్షితం కాదని అంటున్నారు నిపుణులు.. మీకు దగ్గరలో ఎవరైనా మీ ప్యాటర్న్ విధానం గమనిస్తే.. వారు ఈజీగా మీ ఫోన్ అన్ లాక్ చేసేందుకు అవకాశం ఉంది.. అందుకే ఈ ఫోన్ లాక్ అంత సురక్షితం కాదంటున్నారు..
ఎందుకంటే 80 శాతం ఈ ఫోన్ హ్యాకర్లు అన్ లాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లో ప్యాటర్న్ అన్ లాక్ సెట్ చేసుకుంటే మాత్రం ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. మీరు సెట్ చేసిన ప్యాటర్న్ డాట్స్ పై వేలితో గీసినప్పుడు గీతలా కనిపిస్తుంది.. అది కనిపించకుండా Feedback డిసేబుల్ చేయాలి.. లేదంటే మీరు ఎలా అన్‌లాక్ చేస్తున్నారో సులభంగా గుర్తించే ప్రమాదం ఉంది.
అదేలానంటే.. Android డివైజ్‌లో Feedback లైన్లను ఇలా డిసేబుల్ చేయొచ్చు.. Settings >> Lock screen, security >> Secure lock settings >> turn off the Make pattern visible option డిసేబుల్ చేయండి. మీరు ప్యాటర్న్ లాక్ సెట్ చేసుకుంటే మాత్రం ప్యాటర్న్ లైన్లను ఎనిమిది లేదా తొమ్మిది వచ్చేలా సెట్ చేసుకోండి..
https://10tv.in/samsung-galaxy-m51-india-launch-set-for-september-10/
Fingerprint :
ఆపిల్ టచ్ ఐడితో ఫింగర్ ఫ్రింట్ స్కానర్లకు క్రేజ్ పెరిగిపోయింది. భద్రత పరంగా ఇదే బెస్ట్ అని ఎక్కువగా వినియోగిస్తున్నారు.. పాస్‌కోడ్‌ల కంటే రక్షితమైనవిగా చెబుతున్నారు. ఫింగర్ ఫ్రింట్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది.. మరొకరి ఫింగర్ ఫ్రింట్ టచ్ ఐడిని గుర్తించలేరు. ఇందులో 50,000 మందిలో ఒకటి మాత్రమే అవకాశం ఉందని ఆపిల్ పేర్కొంది.
ఫింగర్ ఫ్రింట్ బయోమెట్రిక్ సిస్టమ్‌ల సెక్యూరిటీ చాలా ముఖ్యం.. ఎందుకంటే ప్రస్తుతం ఫోన్‌లు, యాప్ ల ద్వారా పేమెంట్ల కోసం అన్‌లాక్ చేసేందుకు ఫింగర్ ఫ్రింట్ సురక్షితంగా వాడుకోవచ్చు… టచ్ ఐడిని యాక్సస్ చేసేందుకు ఒకరి ఫింగర్ ఫ్రింట్ కాపీ చేసినప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పాస్‌కోడ్‌లు లేదా ప్యాటర్న్ అన్‌లాక్‌ల కంటే ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌లు మంచి సెక్యూర్ సిస్టమ్స్ గా చెప్పవచ్చు.
Face Unlock :
స్మార్ట్ ఫోన్లలో మరో లాకింగ్ సిస్టమ్.. ఫేస్ అన్ లాక్.. మీ ముఖాన్ని పాస్ వర్డ్ గా సెట్ చేసుకోవచ్చు.. మీ ఫేస్ చూడగానే ఆటోమాటిక్‌గా ఫోన్ అన్‌లాక్ అయిపోయేలా సెట్ చేసుకోవచ్చు. ఫింగర్ ఫ్రింట్ లేదా ఐరిస్ అన్ లాకింగ్ సిస్టమ్ కంటే ఫేస్ అన్ లాక్ సిస్టమ్ సెక్యూర్ కూడా.. ఈ బయోమెట్రిక్ సెక్యూర్ ఫీచర్ 2-D వెర్షన్ బైపాస్ చేయొచ్చు.. వాస్తవానికి, శాంసంగ్ గెలాక్సీ S8 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో ఈ లోపాన్ని గుర్తించారు.
2-D ఫేషియల్ అన్‌లాకింగ్ సిస్టమ్‌లను హ్యాకర్ సులభంగా హ్యాక్ చేసే వీలుంది.. మీరు వాడే ఫోన్‌కు అన్‌లాక్ ఆప్షన్ ఉంటే 2-D ఫేషియల్ recognition ఉంటే మాత్రం.. దయచేసి దాన్ని వాడొద్దు. ఫింగర్ ఫ్రింట్ స్కానింగ్ లేదా పాస్‌కోడ్‌లు లేదా 8-నోడ్ ప్యాటర్న్ అన్‌లాక్‌లను వాడొద్దు.. ఆపిల్ ఫేస్ ఐడి వంటి 3-D ఫేస్ స్కానింగ్ ఎంతో సురక్షితమని అంటున్నారు.
Face ID :
ఆపిల్ అందించే facial recognition technology తర్వాత అందించే మరో అప్ డేటెడ్ సిస్టమ్.. Apple Face ID.. చాలా సెక్యూర్ గా ఉంటుంది.. శాంసంగ్ ఫోన్లలో మాదిరిగా సెక్యూర్ సిస్టమ్ ఉండదు… ఫేస్ ఐడి ఉంటేనే ఫోన్ అన్ లాక్ అవుతుంది.. 3-Dలో ముఖాలను ట్రాక్ చేస్తుంది.ఐఫోన్ X డిస్ ప్లే పైభాగంలో మల్టీ న్యూ సెన్సార్లు ఉన్నాయి.. infrared కెమెరా, డాట్ ప్రొజెక్టర్, facial depth scanning కోసం వినియోగించుకోవచ్చు..
3-Dలో మీ ముఖాన్ని ట్రాక్ చేసే 30,000 కనిపించని డాట్లతో నిండిన సెన్సార్లు ఉంటాయి.. ఆపై ఐఫోన్‌లో సురక్షితంగా స్టోర్ చేసిన ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఫోన్‌ను చూసిన ప్రతిసారీ, సిస్టమ్ ఫేస్ ప్యాటర్న్ ట్రాక్ చేస్తుంటుంది. ఫేస్ ఐడిని ఎవరైనా డూప్ చేయాలంటే.. అది మిలియన్‌లో ఒకటిగా జరుగుతుంది.. ఫేస్ ఐడి ద్వారా ముఖంలో కూడా అవసరానికి తగ్గినట్టుగా మార్చుకోవచ్చు. ఇప్పటికీ మీ ముఖంలో హెయిర్ స్టయిల్ మార్పులు, గడ్డం పెంచడం ద్వారా లేదా టోపీలు కండువాలు ధరించినప్పటికీ కూడా ట్రాక్ చేయవచ్చు.
Iris scan :
శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌ల్లో S8 యూజర్లు ఫోన్ భద్రత కోసం ఐరిస్ స్కానర్ వినియోగించుకోవచ్చు. ఐరిస్ స్కానర్ ఎప్పటిలాగే చాలా సెక్యూర్ కూడా.. ఫింగర్ ఫ్రింట్ స్కానింగ్ లేదా 2-D ఫేస్ రికగ్నైజేషన్ కంటే చాలా సెక్యూర్ అని శాంసంగ్ పేర్కొంది. మీ కంటిపాపలోని ప్యాటర్స్ మీకు మాత్రమే ప్రత్యేకమైనవి.. వాటిని కాపీ చేయడం అసాధ్యం, అంటే ఐరిస్ సిస్టమ్ ద్వారా మీ ఫోన్‌ను అన్ లాక్ చేయడానికి సురక్షితమైన మార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు.