Moto Edge 50 Pro Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్.. మోటో ఎడ్జ్ 50ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Motorola Moto Edge 50 Pro Discount : మోటోరోలా కొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ( Flipkart Big Shopping Utsav Sale) సమయంలో అనేక ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందించనుంది.

Moto Edge 50 Pro Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్.. మోటో ఎడ్జ్ 50ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Motorola Moto Edge 50 Pro to get Massive discount during Flipkart Utsav Sale

Updated On : October 8, 2024 / 7:20 PM IST

Motorola Moto Edge 50 Pro Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే  బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ముగిసింది. భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది.

Read Also : TVS Radeon 110 Launch : భలే ఉంది భయ్యా ఈ బైక్.. టీవీఎస్ రేడియన్ లుక్ అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ఇందులో భాగంగా పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈవెంట్‌కు ముందు.. మోటోరోలా కొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ( Flipkart Big Shopping Utsav Sale) సమయంలో అనేక ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందించనుంది. ఈ జాబితాలో మోటోరోలా మోటో ఎడ్జ్ 50ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ వంటి మరిన్ని ఫోన్లు ఉన్నాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో మోటోరోలా మోటో ఎడ్జ్ 50ప్రో ధర రూ. 29,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 35,999 అయితే.. ప్లాట్‌ఫారమ్ రూ. 6వేల తగ్గింపును అందిస్తుంది. మోటో ఎడ్జ్ 50ప్రో ధర రూ.30వేల లోపు తగ్గుతుంది. కొన్ని ఆఫర్‌లతో ఈ ఫోన్ ధర రూ.27,999గా ఉంటుంది.

ఇతర ఫోన్లలో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర రూ. 21,999 కాగా, మోటోరోలా ఎడ్జ్ 50నియో ధర రూ. 23,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ సందర్భంగా మోటో జీ85 స్మార్ట్‌ఫోన్ రూ.16,999కి అందుబాటులో ఉంటుంది. మోటో G45 ఫోన్ ధర రూ.9,999కి డిస్కౌంట్ అందిస్తుంది.

మోటో ఎడ్జ్ 50ప్రో : కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 6.7-అంగుళాల 1.5K పోఓఎల్ఈడీ డిస్‌ప్లేను ట్రూ కలర్ పాంటోన్ వాలిడేటెడ్ సర్టిఫికేషన్‌ కలిగి ఉంది. ప్యానెల్‌కు హెచ్‌డీఆర్10+, 144Hz రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 2,000నిట్స్ సపోర్టు అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఆల్-పిక్సెల్ ఫోకస్, ఓఐఎస్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను అందిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 13ఎంపీ అల్ట్రా-వైడ్+మాక్రో విజన్ సెన్సార్, ఓఐఎస్‌తో 10ఎంపీ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో 50ఎంపీ సెన్సార్ ఉంది.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఏఐ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కలర్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ వంటి ఎఫెక్ట్స్‌తో ఫొటోలకు ఆటోమాటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఇందులో స్పెషల్ ఫీచర్ స్టైల్ సింక్.. యూజర్ల దుస్తుల ఆధారంగా నాలుగు వాల్‌పేపర్ ఆప్షన్ల సెట్‌ను రూపొందించే జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తుంది. కస్టమైజడ్ టచ్‌ను కూడా అనుమతిస్తుంది.

మోటో ఏఐ వీడియోలలో షేకింగ్ తగ్గించేందుకు ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి అదనపు ఫీచర్లను కూడా అందిస్తుంది. హుడ్ కింద, డివైజ్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 125డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. కంపెనీ గరిష్టంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్, 10W వైర్‌లెస్ పవర్ షేరింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Free LPG Cylinder : మహిళలకు గుడ్ న్యూస్.. దీపావళి కానుకగా ఫ్రీ ఎల్‌పీజీ సిలిండర్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!