Netflix Subscribers : పాస్‌వర్డ్‌ షేరింగ్ ఆపేసింది.. నెట్‌ఫ్లిక్స్‌లో అమాంతం పెరిగిన కొత్త సబ్‌స్క్రైబర్లు..!

Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త సబ్‌స్క్రైబర్లు పెరిగారు. కొత్త సబ్ పాస్‌వర్డ్ షేరింగ్‌ ఆపేసిన కొద్ది రోజులకే కొత్తగా రోజువారీ సైన్-అప్‌లు గణనీయంగా పెరిగాయి.

Netflix Subscribers : పాస్‌వర్డ్‌ షేరింగ్ ఆపేసింది.. నెట్‌ఫ్లిక్స్‌లో అమాంతం పెరిగిన కొత్త సబ్‌స్క్రైబర్లు..!

Netflix gains more subscribers after stopping people from sharing passwords

Updated On : June 10, 2023 / 11:15 PM IST

Netflix Subscribers : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఎట్టకేలకు కొత్త సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంది. పాస్‌వర్డ్ షేరింగ్‌ విషయంలో కంపెనీ వ్యూహం ఫలించింది. ఇప్పుడు అదే కంపెనీకి అనుకూలంగా మారింది. విచిత్రమేమిటంటే.. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌‌కు స్వస్తి చెప్పిన కొద్ది రోజులకే కొత్త రోజువారీ సైన్-అప్‌లను గణనీయంగా పెంచింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ యాంటెన్నా ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలనే ప్రణాళికల నేపథ్యంలో అమెరికాలోని సబ్‌స్క్రైబర్లు నాలుగు రోజుల్లోనే భారీగా చేరిపోయారు.

నివేదికల ప్రకారం.. మే 26 నుంచి మే 27 రెండింటిలోనూ నెట్‌ఫ్లిక్స్ లక్ష రోజువారీ సైన్-అప్‌లను సంపాదించింది. ప్రస్తుత డేటా ఆధారంగా, మే 26, మే 27 రెండింటిలోనూ నెట్‌ఫ్లిక్స్ దాదాపు లక్ష రోజువారీ సైన్-అప్‌లను చూసిందని నివేదిక పేర్కొంది. తద్వారా (Netflix) కొత్త రోజువారీ సైన్-అప్‌ల సంఖ్య విపరీతంగా పెరిగింది. మునుపటి 60-రోజుల సగటుతో పోలిస్తే.. గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. ఈ కాలంలో సగటున, ప్రతి రోజు 73వేల మంది యూజర్లు సైన్ అప్ చేశారు. కొత్త సబ్‌స్క్రైబర్‌లలో 102 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.

Read Also : Best-selling SUV Cars : మేలో అత్యధికంగా అమ్ముడైన 10 SUV కార్లు ఇవే.. అందులో 3 మారుతి మోడల్స్ టాప్..!

నెట్‌ఫ్లిక్స్ ఇటీవల కొత్త పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ఇంటి వెలుపలి యూజర్లతో తమ అకౌంట్లను షేర్ చేసే యూజర్లు నెలకు 7.99 డాలర్లు అదనంగా చెల్లించాలి. నెట్‌‌ఫ్లిక్స్ కస్టమర్‌లు తమ అకౌంట్ యాడ్ చేసే అదనపు సభ్యుల సంఖ్య సబ్‌స్క్రయిబ్ సర్వీస్ టైర్‌పై ఆధారపడి ఉంటుంది. అదనపు యూజర్ అకౌంటుతో షేరింగ్ అయ్యే ఖర్చు ప్రాథమిక సభ్యత్వంతో పోలిస్తే నెలకు 2 డాలర్లు తక్కువగా ఉంటుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ గత ఏడాదిలో ప్రవేశపెట్టిన యాడ్-సపోర్టెడ్ ఉన్న ప్లాన్ కన్నా 1 డాలర్ ఎక్కువగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చర్యతో మరింత ఆదాయాన్ని సంపాదించింది.

Netflix gains more subscribers after stopping people from sharing passwords

Netflix gains more subscribers after stopping people from sharing passwords

పాస్‌వర్డ్ షేరింగ్‌ నిలిపివేత మే 23 నుంచి అమలులోకి వచ్చింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ స్టాక్ సుమారు 13 శాతం పెరిగింది. మార్కెట్ పరిశోధన సంస్థ యాంటెన్నా ఆన్‌లైన్ కొనుగోలు రసీదులు, బిల్లులు, బ్యాంకింగ్ రికార్డులు వంటి యూజర్ల సమ్మతితో థర్డ్ పార్టీ మూలల నుంచి డేటాను సేకరిస్తుంది. అయితే, ఈ డేటా బండిల్ సర్వీసుల ద్వారా పొందిన సభ్యత్వాలను కలిగి ఉండదు.

నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి దీనికి సంబంధించి డేటాను రివీల్ చేసేందుకు నిరాకరించారు. పాస్‌వర్డ్ షేరింగ్ సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ఇటీవలి చర్యలు తమ సబ్‌స్క్రైబర్‌లకు క్వాలిటీ కంటెంట్‌ను అందించేటప్పుడు స్థిరమైన వ్యాపార నమూనాను నిర్వహించడానికి సాయపడిందని అన్నారు. ఈ మార్పులతో మల్టీ యూజర్లకు వసతి కల్పించడంతో పాటు ఆదాయ మార్గాలను పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : GPay UPI Payments : గూగుల్ పేలో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు!