Netflix Users : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. 2023 నుంచి మీ అకౌంట్ పాస్‌వర్డ్ ఎవరికి షేర్ చేయలేరు.. ఎందుకో తెలుసా?
Netflix Users : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix Users) యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది (2023) నుంచి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్ (Netflix Password)ను మీ స్నేహితులు, సహోద్యోగులతో షేర్ చేయలేరు.

Netflix Users _ Bad news for Netflix Users, no more password sharing from next year
Netflix Users : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix Users) యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది (2023) నుంచి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్ (Netflix Password)ను మీ స్నేహితులు, సహోద్యోగులతో షేర్ చేయలేరు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని అడ్డుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు అతి త్వరలో రియాలిటీ కాబోతోంది. వచ్చే ఏడాది నుంచి నెట్‌ఫ్లిక్స్ తమ యూజర్లు ఇంటి వెలుపలి యూజర్లకు పాస్‌వర్డ్‌లను షేర్ చేయడానికి అనుమతించదు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. 2023 ఏడాది ప్రారంభం నుంచి నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు (Netflix Subscribers) తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను స్నేహితులతో లేదా ఇతరులు ఎవరితోనూ షేర్ చేయలేరని గుర్తించుకోవాలి.
నెట్‌ఫ్లిక్స్ చాలాకాలంగా పాస్‌వర్డ్ షేరింగ్ (Netflix Password Sharing) విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను ప్రారంభించినప్పటి నుంచి పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యగా మారింది. అయితే సబ్‌స్క్రైబర్లను కోల్పోయే వరకు కంపెనీ దానిని పరిష్కరించలేదు.
నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 2022 ప్రారంభంలో పడిపోయిన తర్వాత పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయాల్సిన అవసరాన్ని కంపెనీ గ్రహించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 10ఏళ్లలో మొదటిసారిగా సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో, నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ మాట్లాడుతూ.. చాలా కాలంగా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

Netflix Users _ Bad news for Netflix Users, no more password sharing from next year
నివేదికల ప్రకారం.. బయట ఎవరితోనైనా పాస్‌వర్డ్‌లను పంచుకునే ఆప్షన్ నెట్‌ఫ్లిక్స్ త్వరలో నిలిపివేస్తుంది. ఫ్రీ పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలనే లక్ష్యంతో.. నెట్‌ఫ్లిక్స్ ఒకరికి మాత్రమే ఛార్జ్ చేయడం ప్రారంభించవచ్చు. దీని అర్థం, మీరు మీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను మీ ఇంటి వెలుపల ఎవరితోనైనా షేర్ చేస్తే.. ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను ఉపయోగించడానికి రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎవరూ చెల్లించకుండా వారి స్నేహితుని నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌ను ఉపయోగించలేరు.
నెట్‌ఫ్లిక్స్ కొత్త పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్ కొన్ని లాటిన్ అమెరికన్ దేశాలలో టెస్టింగ్ చేస్తోంది. కోస్టా రికా, చిలీ, పెరూ మరికొన్ని మార్కెట్‌లలో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ తమ స్నేహితుని నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగించాలనుకునే యూజర్ల కోసం 3 డాలర్లు (సుమారు రూ. 250) వసూలు చేస్తోంది. భారత మార్కెట్లో ఒక్కో యూజర్‌కు ఎంత వసూలు చేస్తుందో కంపెనీ వెల్లడించలేదు.
ఈ మొత్తం దాదాపు ప్రపంచ ధరతో సమానంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. Netflix IP అడ్రస్, డివైజ్ IDలతో పాటు అకౌంట్ కార్యాచరణ ద్వారా కొత్త పాస్‌వర్డ్ షేరింగ్ నియమాన్ని అమలు చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తోంది. పాస్‌వర్డ్ షేరింగ్ క్రాకింగ్ అందులో ఒకటిగా చెప్పుకోవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందడానికి భారీగా చెల్లించకూడదనుకునే యూజర్లను ఆకర్షించాలనే ఆశతో కంపెనీ ఇటీవల యునైటెడ్ స్టేట్స్‌లో 6.99 డాలర్లకి కొత్త సరసమైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ 4 ప్లాన్‌లను అందిస్తుంది. అందులో మొబైల్-ఓన్లీ ప్లాన్ (Mobile Only Plan), బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ ఉన్నాయి. మొబైల్-ఓన్లీ ప్లాన్ రూ. 149 ధరతో వస్తుంది. అయితే బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లు వరుసగా రూ. 199, రూ. 499, రూ. 649గా ఉంటాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..