Smartphone Launch: అద్భుతమైన ఫీచర్లతో.. కొత్త కలర్‌లో Vivo ఫోన్!

భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కొత్త బ్రాండ్లను, అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు వీవో సంస్థ సిద్ధమైంది.

Smartphone Launch: అద్భుతమైన ఫీచర్లతో.. కొత్త కలర్‌లో Vivo ఫోన్!

Vivo

Updated On : October 11, 2021 / 3:36 PM IST

Smartphone Launch: భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కొత్త బ్రాండ్లను, అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు వీవో సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలోనే వీవో వి 21 5G ఫోన్​ని కొత్త కలర్‌లో లాంచింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సంస్థ. Vivo V21 5G స్మార్ట్​ఫోన్​ను​ అక్టోబర్ 13వ తేదీన లాంచ్​ చేయబోతుంది సంస్థ.

స్మార్ట్​ఫోన్ ప్రియులకు ఎంతగానో నచ్చిన ఈ మోడల్ వివో వి 21 5G స్మార్ట్​ఫోన్​ నియాన్ స్పార్క్ కలర్ వేరియంట్‌లో రాబోతుంది. ఇంతకుముందే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ కొత్త కలర్ వేరియంట్‌లో చాలా స్టైలీష్ లుక్‌లో కనిపిస్తుంది. అయితే, కలర్ తప్ప పాత ఫోన్ ఫీచర్లలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ డస్క్ బ్లూ, సన్‌సెట్ డీజిల్, ఆర్టికల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

వివో V21 5G వేరియంట్ ధరలు:
8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ .29,990గా ఉండగా.. 8GB RAM మరియు 256GB స్టోరేజ్ ధర రూ .32,990గా ఉంది.. అదే ధరతో కంపెనీ తన కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేయవచ్చునని అంటున్నారు.

వివో వి21 5జీ ఫీచర్స్:
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌లో ఉంటుంది.
వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తుంది.
వివో వి21లో సింగిల్ లెన్స్‌తో రానుంది.
వివో వి21లో బ్యాక్ కెమెరా ట్రిపుల్ రియర్ సెటప్‌ అందించారు. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు తోడ్పడుతుంది.
ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 లభిస్తుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు.
ఫోన్‌లో 5జీకి సపోర్ట్ కూడా ఉంటుంది.
వివో వి 21 5 జి ఆర్కిటిక్ వైట్, డర్క్ బ్లూ, సన్‌సెట్ డాజిల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
కాగా.. దీని అసలు ధర మధ్యాహ్నం తరువాత వెలువడనుంది.