New UPI Rules : బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచే UPI కొత్త రూల్స్.. బ్యాలెన్స్ చెకింగ్, ఆటోపే, ఫెయిల్ స్టేటస్‌లో రాబోయే మార్పులివే..!
New UPI Rules : యూపీఐలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి యూపీఐ పేమెంట్లలో ఏయే మార్పులు జరుగనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్

New UPI Rules
New UPI Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. గూగుల్ పే, ఫోన్‌పే లేదా పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను ఎక్కువసార్లు వాడుతున్నారా? ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త బ్యాకెండ్ రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. యూపీఐ చెల్లింపుల విధానం పూర్తిగా మారదు. కానీ, వేగవంతంగా ఎలాంటి అంతరాయం లేకుండా మరింత సురక్షితంగా ఉంటాయి. యూపీఐ పేమెంట్లకు సంబంధించి ఏయే కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రద్దీ లేని సమయాల్లో ఆటోపే పేమెంట్స్ ప్రాసెస్ :
వేగవంతమైన పర్ఫార్మెన్స్ కోసం రియల్-టైమ్ పేమెంట్లను నివారించేందుకు అన్ని ఆటోపే లావాదేవీలు రద్దీ లేని సమయాల్లో ప్రాసెస్ అవుతాయి. యూపీఐ ఆటో పే లావాదేవీల కోసం NPCI ద్వారా స్టేబుల్ టైమ్ స్లాట్‌లు ప్రవేశపెడుతుంది. దీని ప్రకారం.. ఈఎంఐలు, యుటిలిటీ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్‌లు, ఆటో పేమెంట్లు వంటి షెడ్యూల్ పేమెంట్లు రోజంతా ఏదో ఒక టైమ్‌లో కాకుండా నిర్దిష్ట విండోలలో మాత్రమే ప్రాసెస్ అవుతాయి.
బ్యాలెన్స్ చెకింగ్‌పై రోజువారీ లిమిట్ :
చాలా మంది వినియోగదారులు తరచుగా యూపీఐ యాప్‌లను ఉపయోగించి తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా సిస్టమ్ స్పీడ్ తగ్గుతుంది. అందుకే ఇకపై ఒక రోజులో మీ బ్యాలెన్స్‌ను ఎక్కువసార్లు చెక్ చేయకుండా NPCI పరిమితిని విధిస్తుంది. కానీ, సర్వర్‌లపై అనవసరమైన ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఈ కొత్త పరిమితిని తీసుకువస్తోంది.
ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. NPCI మార్గదర్శకాల ప్రకారం.. పీక్ అవర్స్‌లో లోడ్‌ను తగ్గించేందుకు UPI యాప్‌లు బ్యాలెన్స్ ఎంక్వైరీ రిక్వెస్టులను పరిమితం చేస్తుంది. 24 గంటల్లో ప్రతి కస్టమర్‌కు 50 యాప్‌ల రోజువారీ లిమిట్ నిర్ణయించింది.
పేమెంట్ ఫెయిల్ స్టేటస్ :
యూపీఐ పేమెంట్లు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోవడం లేదా ‘ప్రాసెసింగ్’ లేదా ‘పెండింగ్’ స్టేటస్ చూపించడం సర్వసాధారణం. ఆగస్టు 1 నుంచి యూపీఐ యాప్‌లు ఇలాంటి పేమెంట్ల స్టేటస్ సెకన్లలోపు అప్‌డేట్ చేయాలి. మీ పేమెంట్ సక్సెస్ అయిదా లేదా ఫెయిల్ అయిందా వెంటనే తెలుసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ మీరు మూడు సార్లు మాత్రమే చెక్ చేయగలరు. ప్రతి చెకింగ్ మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.
సేఫ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ :
ఇకపై బ్యాంకు అకౌంట్ మీదేనా కాదో యూపీఐ యాప్‌లు ధృవీకరిస్తాయి. ఈ అదనపు సెక్యూరిటీ ద్వారా మోసాలు, తప్పుడు అకౌంట్లతో ప్రమాదవశాత్తూ లింక్ చేసేందుకు వీలుండదు. ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లు తమ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లను యాప్‌కు రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేయగలరు.
NPCI ఆదేశాల ప్రకారం.. ప్రతి ఆర్థిక లావాదేవీ తర్వాత జారీ చేసే బ్యాంకులు కస్టమర్ల అకౌంట్లలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ గురించి తెలియజేయాలి.