ఆన్‌లైన్‌లో ఉచితంగా ఫొటోగ్రఫీ కోర్సు.. Nikon హాలీడేస్ ఆఫర్

Nikon free online photography classes : ప్రముఖ ఆప్టికల్ ప్రొడక్ట్ కంపెనీ నికాన్ హాలీడేస్ ఆన్‌లైన్ ఆఫర్ తీసుకొచ్చింది. ప్రమోషన్‌లో భాగంగా ఫొటోగ్రఫీ ఆన్‌లైన్ క్లాసులను హాలీడే సీజన్ కోసం ఉచితంగా అందిస్తోంది. డిసెంబర్ 31 వరకు నికాన్ స్కూల్ ఆన్ లైన్‌లో ఫొటోగ్రఫీ క్లాసులను ఉచితంగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఫొటోగ్రఫీ క్లాసులు వినాలంటే ఫీజు ఒక్కో క్లాసుకు 15 డాలర్లు నుంచి 50 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి కోర్సులో ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆన్ లైన్ క్లాసులను చెబుతుంటారు. ఫొటోగ్రఫీలో ముఖ్యంగా ఇన్ డెప్త్ సెన్సార్లతో ఫొటోలు ఎలా తీయాలో మెళుకవలు నేర్పిస్తారు.
నికాన్ కంపెనీ ‘Nikon School Online’ పేరుతో ఈ ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. మీ చేతిలో నికాన్ కెమెరా ఉంటే చాలు.. ఉచితంగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి మరింత అడ్వాంటేజ్.. కొన్ని క్లాసుల్లో నికాన్ స్పెషిఫిక్ గేర్‌పై ఫోకస్ పెట్టేలా శిక్షణ ఇస్తారు.
కానీ, చాలావరకు ఫొటోగ్రఫీపై ఎలా నైపుణ్యం పెంచుకోవాలనేది ఎక్కువగా కోర్సులో అందిస్తోంది. గతంలో ఏప్రిల్ నెలలో నికాన్ ఇదే ఫ్రీ ఆన్ లైన్ క్లాసుల ఆఫర్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆఫర్‌ను మే 31వరకు పొడిగించింది.
నికాన్ వెబ్ సైట్లో అన్ని ఫొటోగ్రపీ ఆన్ లైన్ క్లాసులను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అందుకు మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ ద్వారా Sign Up చేసుకోవాల్సి ఉంటుంది.