Nokia 3210 UPI Apps : యూపీఐ యాప్స్‌తో నోకియా 3210 ఫీచర్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!

Nokia 3210 UPI Apps : నోకియా 3210 ఫోన్ ధర రూ. 3,999 ఉంటుంది. గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ, వై2కె గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. కొత్త ఫోన్ నోకియా ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Nokia 3210 UPI Apps : యూపీఐ యాప్స్‌తో నోకియా 3210 ఫీచర్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!

Nokia 3210 With Unisoc T107​ SoC ( Image Source : Google )

Nokia 3210 UPI Apps : ప్రముఖ హెచ్ఎండీ నోకియా 3210 ఫీచర్ ఫోన్‌ భారత మార్కెట్లోకి తిరిగి తీసుకొచ్చింది. ఈ కొత్త నోకియా ఫోన్ 25వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. కొత్త నోకియా 3210 ఫీచర్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. యూట్యూబ్ యాక్సెస్‌ను అందిస్తుంది. 1,450mAh బ్యాటరీని అందిస్తుంది. 2ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.

Read Also : Online PAN Card Fraud : పాన్ కార్డు స్కామ్‌లతో జాగ్రత్త.. ఈ మోసాల బారిన పడితే ఎలా గుర్తించాలి? ఎవరికి రిపోర్టు చేయాలంటే?

ఈ ఫీచర్ ఫోన్ యూనిసోక్ టీ107పై రన్ అవుతుంది. ఎఫ్ఎమ్ స్ట్రీమింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. నోకియా 3210 నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)చే ఆమోదించిన ప్రీలోడెడ్ యూపీఐ అప్లికేషన్‌ను కలిగి ఉంది. నోకియా 3210తో పాటు, ఫిన్నిష్ బ్రాండ్ నోకియా 235, నోకియా 220 4జీలను కూడా ఆవిష్కరించింది.

భారత్‌లో నోకియా 3210 ధర ఎంతంటే? :
నోకియా 3210 ఫోన్ ధర రూ. 3,999 ఉంటుంది. గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ, వై2కె గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. కొత్త ఫోన్ నోకియా ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

నోకియా 3210 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ నోకియా 3210 ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 2.4-అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను కలిగి ఉంది. 128ఎంబీ ర్యామ్, 64ఎంబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు యూనిసోక్ టీ107 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ప్రత్యేక మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 32జీబీ వరకు విస్తరించవచ్చు. బ్యాక్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు 2ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

నోకియా 3210 స్కాన్-అండ్-పే ఫంక్షనాలిటీకి ఎన్‌పీసీఐ ఆమోదిత యూపీఐ అప్లికేషన్‌తో ప్రీలోడ్ అయింది. ఈ ఫోన్ నోకియా క్లాసిక్ స్నేక్ గేమ్‌ను కలిగి ఉంది. యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్‌ను అందిస్తుంది. వెదర్, న్యూస్, సోకోబాన్, క్రికెట్ స్కోర్, 2048 గేమ్, టెట్రిస్‌తో సహా ఎనిమిది యాప్‌లకు సపోర్టు ఇస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.0, నోకియా 3210 వైర్డు, వైర్‌లెస్ మోడ్, ఎంపీ3 ప్లేయర్‌తో ఎఫ్ఎమ్ రేడియోను కలిగి ఉంది. 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉంది. దీనికి 1,450mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. 4జీ నెట్‌వర్క్‌లో 9.8 గంటల టాక్‌టైమ్‌ను అందించగలదు. ఈ హ్యాండ్‌సెట్ 122x52x13.14ఎమ్ఎమ్ కొలతలు ఉన్నాయి.

Read Also : Noida Apartments Prices : ఇది విన్నారా? నోయిడాలో 4BHK ప్లాట్ రూ. 15 కోట్లు.. అపార్ట్‌మెంట్ల ధరలపై టెక్కీ వీడియో వైరల్!