నోస్ర్టాడమస్ జోస్యం నిజమైందా?: ఈఫిల్ టవర్ కన్నా అతిపెద్ద ఆస్టరాయిడ్స్ 2021లో భూమిపైకి దూసుకొస్తున్నాయా!

Nostradamus predictions for 2021: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు.. ప్రాన్స్‌కు చెందిన ఖగోళ వేత్త, సిద్ధాంతకర్త, నోస్ట్రడామస్ (Nostradamus) చెప్పిన జోస్యం నిజమవుతోందా? 2021లో మహాప్రళయం ముంచుకోస్తోందా? అంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. 2021లో ఈఫిల్ టవర్ కన్నా అతిపెద్ద పరిమాణంలో ఉండే ఆస్టరాయిడ్స్ భూమికి అతిదగ్గరగా దూసుకొస్తున్నాయంట. మొత్తం ఐదు ఆస్టరాయిడ్లు భూ వాతావరణంలోకి అతిచేరువగా రానున్నాయి.
అందులో రెండు ఈఫిల్ టవర్ కంటే అతిపెద్దదిగా ఉన్నాయంట.. ఫ్రెంచ్ ఖగోళవేత్త నోస్ట్రడామస్ చెప్పిన జోస్యం అక్షరాలా నిజం అవుతుందా? అనే భయాందోళన నెలకొంది. అంటే.. భూమిపైకి దూసుకొచ్చే ఈ ఐదు ఆస్టరాయిడ్స్ భూగ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందా? లేదా అనేది స్పష్టత లేదు. అలా జరిగితే మహా ప్రళయం సంభవిస్తుందా? అనే భయాందోళన వాతావరణం నెలకొంది. 2021లో ఐదు ఆస్టరాయిడ్స్ జనవరి నెలలో భూమికి దగ్గరగా వస్తున్నాయంట.
ఇందులో మూడు ఆస్టరాయిడ్స్ చిన్నగా ఉంటే.. మిగిలిన రెండు ఆస్టరాయిడ్స్ మాత్రం అతిపెద్ద (324 మీటర్లు) పరిమాణంలో ఉన్నాయంట.. ఇదివరకే నోస్ట్రడామస్ 2021లో ఆస్ట్రరాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తాయని జోస్యం చెప్పారు. 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన రాసిన Les Propheties పుస్తకంలో వేలాది ప్రెడిక్షన్స్ చెప్పారు.. అందులో 2021 ఏడాదికి సంబంధించిన జోస్యం కూడా చెప్పారాయన. ఆ పుస్తకంలో ‘a long trail of sparks’ అంటూ ఆకాశంలో మండుతున్న అతిపెద్ద గోళాలు భూమిపైకి దూసుకుస్తాయని రాశారు. ఐదింటిలో మూడు ఆస్టరాయిడ్స్ (2021 AC, 2021 AJ and 2018 KP1) చాలా చిన్నవి.. వీటి వ్యాసం 73.5 మీటర్లు, 19.5 మీటర్లు, 41 మీటర్లు.. వీటితో భూమికి కలిగే ముప్పు ఏమి ఉండదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.
నాల్గో ఆస్టరాయిడ్ (2016 CO247) మాత్రం 340 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇదే అతిపెద్దది. ఆ తర్వాత 2008AF4 ఆస్టరాయిడ్ వైశాల్యం.. కిలోమీటర్‌లో సగానికి ఉంటుందంట. ఇదిగానీ భూమిని ఢీకొడితే.. దీని నుంచి ఉత్పన్నమయ్యే 25 మెగాటన్ల శక్తి.. 50 మెగాటాన్లకు సమానం.. అంటే.. అతిపెద్ద అణుబాంబు విస్పోటనం చెందితే ఉత్పన్నమయ్యే శక్తి అంత ఉంటుంది.. వినాశనమే అన్నట్టే. అయితే.. ఈ ఐదు ఆస్టరాయిడ్స్ ఎంతవేగంతో భూమికి అతిదగ్గరగా దూసుకొస్తున్నాయి అనేదానిబట్టి ఆధారపడి ఉంటుంది. భూమికి ముప్పు ఉందా లేదా అనేది అంచనా వేయొచ్చు.
ఈ ఐదింటితో భూమికి ఇప్పటికప్పుడే జరిగే ముప్పు ఏమి లేదని NASA గట్టిగా చెబుతోంది. వాస్తవానికి ఐదు ఆస్టరాయిడ్స్ మొత్తం భూమికి 7.5 మిలియన్ల కిలోమీటర్లు దగ్గరగా వస్తున్నాయి. చంద్రునికి భూమికి మధ్య దూరం 19.5 రెట్టింపు లేదా 150 మీటర్ల కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఫ్రెంచ్ జ్యోతిష్యులు నోస్ట్రడామస్ చెప్పిన 6,338 జోస్యాల్లో 3,797 జోస్యాలు నిజమయ్యాయి.