OnePlus 13s vs Nothing Phone 3: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఇంతగా ఎందుకు ఆకర్షిస్తున్నాయి? మీరైతే ఏది కొంటారు?
మెటల్ ఫ్రేమ్, మ్యాట్ ఫినిష్ ఉన్న గ్రీన్ సిల్క్ వేరియంట్ హైఎండ్ లుక్ ఇస్తుంది.

భారత్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత నథింగ్ ఫోన్ 3 అందుబాటులోకి వచ్చేసింది. ఇది డిజైన్ పరంగా OnePlus 13sతో పోటీ పడుతోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బాగుంటుందో చూడండి..
డిజైన్
నథింగ్ ఫోన్ 3లో సాధారణ LED స్ట్రిప్‌లకు బదులుగా 25×25 మేట్రిక్స్ LED డిస్క్ తీసుకొచ్చారు. ఇది semi-transparent బ్యాక్‌ప్యానెల్‌పై టైం, బ్యాటరీ, కాంపాస్ వంటి డేటాను చూపుతుంది. కెమెరా ట్రైయాంగిల్ షేప్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
వన్‌ప్లస్ 13s డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. కేవలం 185 గ్రాముల వెయిట్ ఉంది. మెటల్ ఫ్రేమ్, మ్యాట్ ఫినిష్ ఉన్న గ్రీన్ సిల్క్ వేరియంట్ హైఎండ్ లుక్ ఇస్తుంది.
డిస్‌ప్లే
నథింగ్ ఫోన్ 3లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్‌రేట్, 1.5K రిజల్యూషన్ తో వచ్చింది. గోరిల్లా గ్లాస్ 7i, 10-బిట్ కలర్, HDR10+ సపోర్ట్ ఉంది.
వన్‌ప్లస్ 13sలో 6.32 అంగుళాల LTPO ProXDR డిస్‌ప్లే ఉంది. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్‌రేట్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్, డాల్బీ విజన్ సపోర్ట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది.
Also Read: ఈ ఆఫర్ అదుర్స్ కదూ.. తక్కువ ధరకే Vivo స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోండి..
బ్యాటరీ, పర్ఫార్మెన్స్
వన్‌ప్లస్ 13sలో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. 4.32GHz వరకు క్లాక్ స్పీడ్ ఉండే రెండు ప్రైమ్ కోర్‌లు ఉంటాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది.
నథింగ్ ఫోన్ 3లో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఉంది. ఇది మంచి ప్రాసెసర్ అయినా Elite కంటే తక్కువ పవర్‌ఫుల్. సాధారణంగా ఈ ప్రాసెసర్ ఉన్న ఫోన్లు రూ.40,000 లోపు ఉంటాయి.
వన్‌ప్లస్ 13sలో 5,850mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ ఉంటుంది. చార్జర్ ప్యాక్‌లోనే వస్తుంది. నథింగ్ ఫోన్ 3లో 5,500mAh బ్యాటరీ, 65W కేబుల్ చార్జింగ్, 15W వైర్లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్ ఉంటుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం OnePlus 13sలో 4,400mm² కూలింగ్ సిస్టమ్ ఉంది.
కెమెరా
నథింగ్ ఫోన్ 3లో మూడు కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ, టెలిఫోటో (3x జూమ్), అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 50MP.
వన్‌ప్లస్ 13sలో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32MP ఉంటుంది. నథింగ్ ఫోన్ 3 ఫోన్ కెమెరా సెటప్ వైవిధ్యంగా ఉంటుంది కానీ వన్‌ప్లస్ కెమెరా ప్రాసెసింగ్ బాగుంటుంది.
ధర
నథింగ్ ఫోన్ 3 ధర రూ.79,999 నుంచి మొదలవుతుంది (256GB స్టోరేజ్, 12GB RAM). 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 89,999. బ్లాక్, వైట్ కలర్‌లో లభిస్తుంది.
వన్‌ప్లస్ 13s ధర 12GB + 256GB వేరియంట్‌కు రూ. 54,999. 512GB వేరియంట్ రూ. 59,999. పింక్ సాటిన్, బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ ఇండియన్ ఎడిషన్ కలర్ వేరియంట్లు ఉన్నాయి.
ఏది కొనాలి?
పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, మంచి థర్మల్ కంట్రోల్, తక్కువ ధర కావాలంటే OnePlus 13s బెస్ట్ చాయిస్. ప్రత్యేక డిజైన్, వైర్లెస్ చార్జింగ్, ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే Nothing Phone 3 మీకు నచ్చుతుంది.