OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. నవంబర్‌లోనే లాంచ్.. ఫీచర్లపై భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చంటే?

OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ 15 వస్తోంది. భారత మార్కెట్లో వచ్చే నవంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర, ఫీచర్ల వివరాలివే..

OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. నవంబర్‌లోనే లాంచ్.. ఫీచర్లపై భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చంటే?

OnePlus 15 Launch

Updated On : October 23, 2025 / 4:38 PM IST

OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ 15 ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 27న చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. ఆ తర్వాత భారత మార్కెట్లో కూడా వన్‌ప్లస్ 15 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో మైక్రోసైట్‌లో రివీల్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ వివరాలను టీజ్ చేసింది.

నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 14 సిరీస్‌‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ (OnePlus 15 Launch) అని చెప్పొచ్చు. డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌తో మరిన్ని అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. వన్‌ప్లస్ 15 కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC కలిగి ఉంటుందని వన్‌ప్లస్ ధృవీకరించింది. వన్‌ప్లస్ 15కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 15 భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
కంపెనీ ఇండియా పోర్టల్‌లోని మైక్రోసైట్‌లో అక్టోబర్ 29న వన్‌ప్లస్ 15 లాంచ్ ఎప్పుడు అనేది వెల్లడించనుంది. అయితే, దీనిపై వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. చైనాలో అక్టోబర్ 27న లాంచ్ కానుంది. భారత మార్కెట్లో నవంబర్ మొదటి వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Royal Enfield Meteor 350 : బుల్లెట్ బైక్ కావాలా? కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వేరియంట్ వారీగా ధరలివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!

వన్‌ప్లస్ 15 స్పెసిఫికేషన్లు :
రాబోయే వన్‌ప్లస్ 15 ఫోన్ సరికొత్త ఫీచర్లతో రానుందని కంపెనీ ధృవీకరించింది. ఇందులో G2 గేమింగ్ నెట్‌వర్క్ చిప్ కూడా ఉంది. వీక్ సిగ్నల్ ప్రాంతాలలో కూడా Wi-Fi, సెల్యులార్ సిగ్నల్ పెంచుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-ఫాస్ట్ టచ్ రెస్పాన్స్ కోసం ఆండ్రాయిడ్ ఫస్ట్ టచ్ డిస్‌ప్లే సింక్ ఫీచర్‌ కూడా కలిగి ఉంది. గేమింగ్ సెషన్‌ల సమయంలో థర్మల్ పర్ఫార్మెన్స్ కోసం ఎయిర్‌జెల్ ఇన్సులేషన్, అల్ట్రా-థిన్ వేపర్ చాంబర్‌ కొత్త “గ్లేసియర్” కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది.

ఇంటర్-గేమ్ రీఛార్జ్ ఫీచర్ అద్భుతమైన విజువల్స్ కోసం 165Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K BOE ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7,300mAh బ్యాటరీతో వస్తుంది. అదనంగా, హ్యాండ్‌సెట్ చైనీస్ కౌంటర్‌పార్ట్ మాదిరిగా అదే సాఫ్ట్‌వేర్ వెర్షన్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత ఆక్సిజన్ OS16తో వస్తుంది. అలాగే, వన్‌ప్లస్ 15 అబ్సొల్యూట్ బ్లాక్, మిస్టీ పర్పుల్, సాండ్ డ్యూన్ ఫినిషింగ్‌తో వస్తుంది. భారత్ ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15 ధర రూ. 79,999 వరకు ఉండే అవకాశం ఉంది.